వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రివా? భూముల బ్రోకర్‌వా? - కేసీఆర్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్

|
Google Oneindia TeluguNews

''కేసీఆర్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక భూముల బ్రోకర్ వా? పేదలను కొల్లగొట్టడమే విధానమా? నీ లాంటోళ్లను చాలా మందిని చూశాం.. నువ్వెంత ఆఫ్ట్రాల్.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు..''అంటూ సీఎంను ఉద్దేశించి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు. సహజంగా దూకుడు వ్యాఖ్యలకు దూరంగా ఉండే భట్టి.. సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశమైంది.

తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు? ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేదుగా: మంత్రి కొడాలి నాని సంచలనంతిరుమలలో డిక్లరేషన్ ఎందుకు? ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేదుగా: మంత్రి కొడాలి నాని సంచలనం

 ఫార్మా సిటీ బాధితుల చెంతకు..

ఫార్మా సిటీ బాధితుల చెంతకు..

కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఫార్మాసిటీ ఏర్పాటులో బాధితులకు పరిహారంపై న్యాయంగా వ్యవహరించడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం కురుమిద్ద గ్రామంలో ఫార్మా సిటీ భూ భాదిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో పేదల ఇళ్ల కోసం కేటాయించిన భూముల్ని కేసీఆర్ సర్కారు కార్పొరేట్లకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నదని, టీఆర్ఎస్ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని భట్టి మండిపడ్డారు.

పోరాడితే పోయేదేమీ లేదు..

పోరాడితే పోయేదేమీ లేదు..

‘‘భూమితో మనిషికి భావోద్వేగమైన సంబంధం ఉంటుంది. దాన్ని మననుంచి లాక్కుంటే సహించేది లేదు. నాడు ఇందిరమ్మ పేదల కోసం భూములు కేటాయిస్తే.. ఇప్పుడు కేసీఆర్ కార్పొరేట్లకు దాళారీగా మారి ఆ భూముల్ని కాజేయాలని చూస్తున్నాడు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మనం ఏకం కావాల్సిందే. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప'' అంటూ భూనిర్వాసితులను ఉద్దేశించి సీఎల్పీ నేత భావోద్వేగంగా ప్రసంగించారు.

Recommended Video

Uttam Kumar Reddy, Bhatti Vikramarka Slams KCR Govt Over Corona Cases Issue
 20 వేల ఎకరాలకు ఎసరు..

20 వేల ఎకరాలకు ఎసరు..

గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం కేటాయించిన 8 వేల ఎకరాలు, రైతులకు కేటాయించిన 12 వేల ఎకరాలు.. మొత్తం కలిపి 20 వేల ఎకరాల వ్యవసాయ భూమిని ఫార్మాసిటికి ధారాదత్తం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని, ఈ ఫార్మాసిటి చుట్టూ వంద కిలోమీటర్ల మేర కలుషితం కావడంతో పాటు.. భూగర్భ జలాలు, కృష్ణ నీళ్లు కలుషితం అవుతాయని భట్టి చెప్పారు. నిర్వాసితులు, రైతులు, గ్రామస్తులకు న్యాయం దక్కేదాకా కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. కురుమిద్ద గ్రామంలో ఫార్మా సిటీ వ్యతిరేక సభలో సీఎల్పీ నేతతోపాటు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నేత సుంకేట అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకేపూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకే

English summary
telangana congress legislative party leader Mallu Bhatti Vikramarka made sensational remarks on chief minister kcr over land related issues. addressing the meeting of Pharma City affected farmers in Kurumidda village in Yacharam of Rangareddy district on sunday, CLP leader criticized the CM KCR for adopting anti-people policies in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X