వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తమ్‌ను తప్పించకపోతే ఎన్నికల్లో పోటీచేయను: కోమటిరెడ్డి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Komatireddy brothers to join in Bjp ఉత్తమ్ ఎఫెక్ట్, బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్| Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశ్యం తమకు లేదని సిఎ‌ల్‌పి ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. పార్టీలోనే ఉంటూ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతారనే ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు.

నాలుగైదు రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకొంటున్న పరిణామాలు కోమటిరెడ్డి సోదరులు బిజెపిలోకి చేరుతున్నారనే సంకేతాలు ఇచ్చినట్టు కన్పించింది. పిసిసీ కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రె్డ్డి డిమాండ్ చేశారు.

ఉత్తమ్ ఎఫెక్ట్: బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్, టిఆర్ఎస్‌కు దూరమైన కారణమిదేఉత్తమ్ ఎఫెక్ట్: బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్, టిఆర్ఎస్‌కు దూరమైన కారణమిదే

పిసిసీ కార్యకవర్గాన్ని ప్రక్షాళన చేయకపోతే మా దారి మేం చూసుకొంటామని కోమటిరెడ్డి సోదరులు ప్రకటించారు. అయితే కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం కూడ లేకపోలేదు.

Clp leader responses on rumours on ready to join in Bjp

ఈ వార్తలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. పార్టీ మారే ఆలోచన తమకు లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. పార్టీలోనే ఉండి పోరాటం చేస్తామని చెప్పారు. ఫంక్షన్ హాల్ లో మీటింగులు పెట్టుకుంటే ఎన్నికల్లో గెలవలేరని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. . టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సరైన ఫలితాలు రావడం లేదని... ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

పీసీసీ చీఫ్ పదవిని తమకు ఏడాది పాటు ఇవ్వాలని... తమకు ఇవ్వక పోతే తెలంగాణ కోసం ఉద్యమించినవారికైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి నాయకత్వంలో పార్టీ దూసుకుపోతుందో... హైకమాండ్ సర్వే చేయించాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని... ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతానని చెప్పారు.

English summary
Clp deputy leader Komatireddy Venkat reddy responded rumours on ready to join in Bjp.Komati reddy condemned rumours on ready to join bjp.He demanded to Aicc remove Uttam kumar reddy from Tpcc president post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X