వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా గురించి మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తాం... టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీని వీడీ తేరాసలో విలీనం తర్వాత ఆపార్టీ ఎమ్మెల్యేలు ఆనేక ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. దీంతో వారు ఎట్టకేలకు నోరు విప్పారు.సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడం రాజ్యంగబద్దమేనని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగదాలతో కోట్టుమిట్టాడుతున్న నేపథ్యంలోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

రాజ్యంగం ప్రకారమే తేరాసలో చేరాము...

రాజ్యంగం ప్రకారమే తేరాసలో చేరాము...


పార్టీని వీడిన తర్వాత సీఎం కేసిఆర్‌తో సమావేశమైన ఎమ్మెల్యేలు అనంతరం మీడీయాతో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై భవిష్యత్ పై భరోస లేకపోవడం వల్లే పార్టీ మారమని తేల్చి చెప్పారు. అవసరమైతే తాము ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.రాజ్యాంగం ప్రకారమే సీఎల్పీని విలీనం చేయాలని కోరామని , చట్టప్రకారమే విలీనం జరిగిందని అయినా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోలేదని స్పష్టం చేశారు.ఇక జూన్ 6వ తేదినే 12 మంది ఎమ్మెల్యేలు ఓకేసారి తేరాలో చేరామని తెలిపారు.

పరువు నష్టం దావ వేస్తాం...

పరువు నష్టం దావ వేస్తాం...


కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేస్తుంది. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేలు పార్టీ మారడంతోపాటు వ్యక్తిగత అవసరాల కోసం చేరారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు వీటిపై స్పందించారు. ఇలాంటీ మాటలు తిడితే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క జడ్పీటీసీని కూడ గెలుచుకోలేదని అన్నారు. ఈనేపథ్యంలో చిల్లర మల్లరగా మాట్లాడీ పరువు తీస్తే పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు.

నియోజవర్గం ప్రజల కోరిక మేరకే పార్టీ మార్పు

నియోజవర్గం ప్రజల కోరిక మేరకే పార్టీ మార్పు


మరోవైపు నియోజకవర్గాల అభివృద్దితోపాటు ప్రజల కోరిక మేరకే పార్టీ మారమని చెప్పారు.ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని అన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు రాలేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అయిన పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం మారడం లేదని అన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై ఆత్మ పరీశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీ ఓటమీపై సమీక్ష నిర్వహించుకోవాలని అన్నారు

English summary
the Congress Legislative Party merged with TRS Legislative Party as per the constitutional provisions said who The MLAs joined in TRS.MLAs are answerable only to the people not to the Congress party.they also announced
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X