వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ఎల్పీ లో సీపీఎల్పీ విలీనం సమంజసమేనా ? ప్రజలేమంటున్నారు ?

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం సమంజసమేనా? ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ వైపు ఫిరాయించడం కరెక్టేనా? తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయడం సబబేనా? ఇవి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు.

కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణాకు తొలిసారిగా కిషన్ రెడ్డి రాక .. ఘనంగా స్వాగతం పలుకనున్న బీజేపీకేంద్ర మంత్రి హోదాలో తెలంగాణాకు తొలిసారిగా కిషన్ రెడ్డి రాక .. ఘనంగా స్వాగతం పలుకనున్న బీజేపీ

కాంగ్రెస్ నుండి పోటీచేసినా నమ్మి ఓట్లేసిన ప్రజలు .. మోసం చేసిన ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ నుండి పోటీచేసినా నమ్మి ఓట్లేసిన ప్రజలు .. మోసం చేసిన ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. చాలా స్పష్టమైన మెజారిటీతో రెండోసారి అధికారం కట్టబెట్టారు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినా 19 మంది ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల ప్రజలు గెలిపించారు. వారిని గెలిపించడానికి కారణం గత ఐదేళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తమ నియోజక వర్గానికి ఏ విధమైన మేలు చెయ్యలేదు అన్న భావనే కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించేలా చేసింది. అంతేకాదు తమ తరపున పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైన వారిని భావించి ఆయన నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ హవా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించారు. తమ ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేస్తారని, తమ కోసం పాటుపడతారని నమ్మి మోసపోయారు.

స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులు చేస్తున్న ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో అసహనం

స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులు చేస్తున్న ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో అసహనం

ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఏ పార్టీ నుండి గెలిచినప్పటికీ ఆ పార్టీకి కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. కానీ స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయించడం తెలుగు రాష్ట్రాల్లో కామన్ అయిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినప్పటికీ నమ్మి వారికి ఓట్లు వేసి గెలిపిస్తే తీరా వారు తమ రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ వైపు ఫిరాయించారు. ఇక ఇదేంటి అని ప్రశ్నించేవారికి ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి పథకాలు చూసే ఆకర్షితులమయ్యామని , తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాము అని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు తీరా గెలిచిన తర్వాత ఇలా పార్టీలు ఫిరాయించడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు.

పార్టీ ఫిరాయింపులు .. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చెయ్యటం నిరంకుశ పాలనకు నిదర్శనం

పార్టీ ఫిరాయింపులు .. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చెయ్యటం నిరంకుశ పాలనకు నిదర్శనం

ఇలాంటి ఫిరాయింపుల తో రాజకీయ పార్టీల మీద విశ్వాసం ప్రజలకు పూర్తిగా సన్నగిల్లుతుంది. ఇటు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టిన టిఆర్ఎస్ పార్టీ ప్రజా పాలన పైన దృష్టి పెట్టి అభివృద్ధి పధాన రాష్ట్రాన్ని నడిపించాల్సింది పోయి, పక్క పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసే పనిలో పడింది. రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తి లేకుండా ఎదగాలి అన్న ఆలోచన పక్క పార్టీల నాయకులను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంది. అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయటం ఒక నిరంకుశ పాలనకు నిదర్శనంగా అటు విపక్షాలు, ఇటు ప్రజలు భావిస్తున్నారు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారుతున్న ఫిరాయింపులు
పాలకులు పాలన చేస్తే, అందులో ఉండే లోటుపాట్లను ఎత్తి చూపుతూ, ప్రజల సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళుతూ ప్రతిపక్షాలు పాలన సజావుగా సాగేలా చూడాలి. కానీ అలాంటి ప్రతిపక్షమే లేకుండా చేస్తే రాష్ట్రంలో ఏ విధమైన పాలన ఉన్నట్టు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని, పార్టీలు మారి ఫిరాయింపులు చేస్తూ సాగుతున్న నేటి రాజకీయం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తోంది.

English summary
Is this correct or not merger of CLP in TRSLP? Is it true that the Congress party MLAs will not cross the judgment of the people ? Despite the clear majority of the ruling party in the state of Telangana, the Opposition party MLAs have been encouraged to defects and make the opposition free of opposition in the assembly? These are the questions people think of in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X