వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసిఆర్ ఆఫర్ ఇచ్చాడు.... దర్శకుడు కె.విశ్వనాథ్ తిరస్కరించాడు... ఏమిటా ఆఫర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సిఎం కేసీఆర్ సాహిత్యానికి ప్రముఖ సిని దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఫిదా అయ్యాడు. . కాగా విశ్వనాథ్ అభిమానిగా సీఎం కేసీఆర్ ఫిలింనగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటి అయ్యాడు.ఈ సంధర్భంగా దర్శకుడు విశ్వనాథ్ సినిమాలో ఓ పాటకు సంబంధించిన సాహిత్యంపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని విశ్వనాథ్ చెప్పాడు.

అనంతరం దర్శకుడు కె. విశ్వనాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌లో సాహిత్యంతోపాటు పలు కోణాలు ఉన్నాయని,ఇన్ని కోణాలు సీఎం కేసీఆర్‌లో ఉన్నాయని తాను ఊహించలేదని చెప్పారు. ఈనేపథ్యంలోనే చిన్నప్పుడు ఉపాధ్యాయుడు చెప్పిన పద్యాన్ని సీఎం వివరించడం చాల అశ్చర్యాన్ని కల్గించిదని అన్నారు. ఈ సంధర్భంగా సీఎం మాటలు వింటే తనకు అనందం కల్గించిందని విశ్వనాథ్ చెప్పారు.

cm gave offer to director k.vishwanath but he rejected...!what is that offer

ఇక అంతకు ముందు విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేకపోవడంతోనే సీఎం పరామర్శించేందుకు వెళ్లాడని వెలువడ్డ వార్తలను విశ్వనాథ్ కొట్టిపారేశాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒక అభిమానిగానే కేసీఆర్ తన ఇంటికి వచ్చాడని ఆయన వివరించాడు. ఈసంధర్భంగానే తన ఆరోగ్యం గురించి వాకబు చేశాడని తెలుస్తోంది. ఈ సంధర్భంగా సీఎం కేసీఆర్ తన ఇంటికి రావడం శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్లు ఉందని విశ్వనాథ్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు కె.విశ్వానాథ్ సినిమాలు తీయక సుమారు 10 సంవత్సరాలు అవుతుందని ,చాల మంది అభిమానులు సినిమాలు తీయాలని కోరుతున్నారని, అయితే తాను అందుకు సిద్దంగా లేనని విశ్వనాథ్ చెప్పాడు. ఇక విశ్వానాథ్ సినిమాలు తీస్తే తాను నిర్మాణ భాద్యతలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీంతో విశ్వనాథ్ సైతం ఇప్పుడు ఆ ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

English summary
Telangana chief minister KCR met famous film director k.Vishwanath.and they discussed about the lyrics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X