వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ , కేసీఆర్ లు .. దానిపై స్టే విధించండి : అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines | Asaduddin Owaisi Warns BJP

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు సీఏఏ , ఎన్నార్సీకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక తాజాగా అసదుద్దీన్ ఓవైసీ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనూ సభలు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు.ఇక ఏపీలో జరిగిన సభలో మాట్లాడిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు .

సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్

 సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌‌లకు వ్యతిరేకంగా ఎంఐఎం పోరాటం

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌‌లకు వ్యతిరేకంగా ఎంఐఎం పోరాటం

దేశంలో 2024 వరకు పౌరసత్వ చట్టాలను అమలు కానివ్వబోమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు . కేంద్రంలోని బీజేపీ సర్కార్ పౌరసత్వ చట్టాలతో భారత్‌‌ను హిందువుల దేశంగా మార్చాలనే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌‌లకు వ్యతిరేకంగా తమ పార్టీ భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగిస్తుందని ఆయన గట్టిగా చెప్పారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు సీఏఏ ను వ్యతిరేకించాలని ఓవైసీ విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాల సీఎంలు సీఏఏ ను వ్యతిరేకించాలని ఓవైసీ విజ్ఞప్తి

కేంద్రంలోని బీజేపీ మొండిగా ప్రవర్తిస్తుందని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ ఎవరు ఏం చెప్పినా సరే, బీజేపీ ప్రభుత్వం తమను కాల్చి చంపాలని చూసినా దేశం విడిచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తాము ఎలాంటి పత్రాలు చూపించబోమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సీఏఏకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

బడ్జెట్ లో రాష్ట్రాలకు నిధులు లేవు కానీ ఎన్‌పీఆర్ అమలుకు నిధులున్నాయా అని ప్రశ్న

బడ్జెట్ లో రాష్ట్రాలకు నిధులు లేవు కానీ ఎన్‌పీఆర్ అమలుకు నిధులున్నాయా అని ప్రశ్న

వెంటనే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై స్టే విధించాలని ముఖ్యమంత్రులకు ఆయన విన్నవించారు . అలాగే తెలుగు రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని , బడ్జెట్ లో మొండి చెయ్యి చూపించారని మండిపడ్డారు . ఏపీకి నిధులు ఇవ్వరు గానీ ఎన్‌పీఆర్ అమలుకు మాత్రం నిధులు ఉన్నాయా అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ఓవైసీ నిలదీశారు. ఎటువంటి పరిస్థితిలోనూ తెలుగు రాష్ట్రాల్లో సీఏఏ అమలు కాకుండా అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు .

English summary
Asaduddin Owaisi, said that the BJP at the center was acting stubbornly, and the BJP government wanted to kill them but not leave the country. They made it clear that they were not going to show any documents. He also asked the chief ministers of Telugu states to take a decision against the CAA. He appealed to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and Telangana Chief Minister KCR to oppose the NRC and NPR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X