వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ అబద్దాలకు అంబాసిడర్ : భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ధిక మాంద్యం లేదని ప్రకటించిన ఆయన మాంద్యం ముసుగులో నిధులు లేవంటూ తన అసమర్ధను కప్పిపుచ్చుకునేందుక సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ను అబద్దాలకు అంబాసిడర్‌గా మారిస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.

 ప్రజలపై మూడు లక్షల కోట్ల భారం

ప్రజలపై మూడు లక్షల కోట్ల భారం

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు మాట్లాడిన సీఎం కేసిఆర్ బీజేపీ విధానాల వల్ల ఆర్ధిక మాంద్యం వచ్చిపడిందని ఆయన విమర్శించారు. దీంతో సీఎం కేసీఆర్‌పై లక్ష్మన్ మండిపడ్డారు. సమావేశాల్లో భాగంగా సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడరని ఆయన ఫైర్ అయ్యారు. శాసన సభను టీఆర్ఎస్ సభగా మార్చారని అన్నారు. ఈనేపథ్యంలోనే సుమారు 3 లక్షల కోట్ల రుపాయాలు అప్పు చేసి ప్రజల భారం మోపారని ఆయన ఫైర్ అయ్యారు. అప్పును కూడ ఆదాయంగా చూపిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందని ఆయన చెప్పారు.

దేశంలో మాంద్యం ఉన్నా రాష్ట్రంలో లేదు...

దేశంలో మాంద్యం ఉన్నా రాష్ట్రంలో లేదు...

ఇక ఆర్ధిక మాంద్యం కారణంగా రాష్ట్రానికి ఆదాయం తక్కువగా రానుందని సీఎం చేప్పారు . అయితే దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్నా రాష్ట్రంలో లేదని లక్ష్మన్ అన్నారు. అయితే ఆర్ధిక మాంద్యం ముసుగులో సీఎం కేసిఆర్ తన అసమర్ధతను కప్పిపుచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. అయితే దేశంలో ఆర్ధిక మాంద్యం లేదని ఆర్ధిక మందగమనం మాత్రమే ఉందని అన్నారు. ఇందుకోసం కేంద్రం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. అయితే ఏడాది కాలంగా ఆర్ధిక మాంద్యం ఉందని కేసిఆర్ ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పలేదా ...

రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పలేదా ...

ఇక సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే అనేక అంశాలు ప్రచారం చేశారని, ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ అయిదు లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రచారం చేశారని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు బడ్జెట్ కేటాయింపుల తగ్గాయని ఆయన ప్రశ్నించారు. లేనివి ఉన్నట్టు కేసిఆర్ అబద్దపు ప్రచారం చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీర్ ఫెడరల్ ఫ్రంట్, టెంటు ఎక్కడికి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే పీఏసీ ఛైర్మెన్ పదవి అక్బరుద్దీన్‌కు ఇవ్వడం చూస్తే కేసీఆర్ పాలన ఎలాంటీదో అర్ధమవుతుందని అన్నారు.

English summary
CM KCR of misleading the Telangana people, BJP state president Dr Lakshman said.He declared that there was no economic recession in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X