వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2023 - గులాబీ సేన సన్నద్దం : 33 జిల్లాలకు అధ్యక్షుల నియామకం - ఎవరెక్కడ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత ..ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. టార్గెట్ 2023 దిశగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పైన రాజకీయ యుద్దం ప్రకటించిన కేసీఆర్.. ఇక, రాష్ట్రంలో ముందుగా సొంత పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఒకే సారి 33 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసారు. మిగిలిన వాటిని క్లియర్ చేసేందుకు కసరత్తు సాగుతోంది.

ఎంపీ - ఎమ్మెల్యేలకూ బాధ్యతలు

ఎంపీ - ఎమ్మెల్యేలకూ బాధ్యతలు

ఇదే సమయంలో జిల్లా అధ్యక్షులుగా 19 మంది ఎమ్మెల్యేలు... ముగ్గురు ఎంపీలు.. ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మన్లు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చారు. తాజాగా నియమించిన అధ్యక్షులు... 1.ఆదిలాబాద్ -జోగు రామన్న, ఎమ్మెల్యే 2. కొమురం భీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే 3. మంచిర్యాల- సుమన్, ఎమ్మెల్యే 4. నిర్మల్- జి. విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే 5. నిజామాబాద్- ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే 6. కామారెడ్డి- యం.కె. ముజీబుద్దీన్, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ 7. కరీంనగర్ -జి.వి. రామకృష్ణారావు, ఛైర్మన్, సుడా 8. రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ 9. జగిత్యాల- కె. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే - కెసీఆరే శాంతి భ‌ధ్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించారు 10. పెద్దపల్లి- కోరుకంటి చందర్, ఎమ్మెల్యే కు బాధ్యతలు అప్పగించారు.

2023 ఎన్నికలే లక్ష్యంగా

2023 ఎన్నికలే లక్ష్యంగా

11. మెదక్- యం పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్యే 12. సంగారెడ్డి- చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే 13. సిద్దిపేట- కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ 14. వరంగల్- అరూరి రమేష్, ఎమ్మెల్యే 15. హనుమకొండ- దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే 16. జనగామ- పి. సంపత్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ 17. మహబూబాబాద్- మాలోతు కవిత నాయక్, ఎంపీ 18. ములుగు - కుసుమ జగదీశ్, జెడ్పీ చైర్మన్ 19. జయశంకర్ భూపాలపల్లి - గండ్ర జ్యోతి, జెడ్పీ ఛైర్మన్- ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ వాహ‌నంపై దాడి 20. ఖమ్మం- తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ 21. భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతా రావు, ఎమ్మెల్యే 22. నల్గొండ - రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే 23. సూర్యాపేట -బడుగుల లింగయ్య యాదవ్ ను నియమించారు.

మొత్తం జిల్లాలకు ఒకేసారి

మొత్తం జిల్లాలకు ఒకేసారి

24. యాదాద్రి భువనగిరి -కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఛైర్మన్, ఆయిల్ ఫెడ్ 25. రంగారెడ్డి - మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే 26. వికారాబాద్ - డా. మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే 27. మేడ్చెల్ - శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ 28. మహబూబ్ నగర్ - సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే 29. నాగర్ కర్నూల్ - గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే 30. జోగులాంబ గద్వాల - బి. కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే 31. నారాయణపేట - ఎస్. రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే 32. వనపర్తి - ఏర్పుల గట్టుయాదవ్, మున్సిపల్ ఛైర్మన్ 33. హైదరాబాద్ - మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే ను నియమించారు.

English summary
TRS Chief KCR Appointed new presidents for party in all 33 districts. KCR given chanve for MP and MLA's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X