వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వలసకూలీల కోసం రైలు లేదంటే బస్సులు, నడిచి మాత్రం వెళ్లొద్దు: సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ కంటిన్యూ అవడంతో వలసకూలీలు స్వస్థలాల బాట పడుతూనే ఉన్నారు. శ్రామిక్ రైళ్లు ఏర్పాటుచేసిన.. కొందరు ట్రక్కుల్లో పయనిస్తూ ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వందల కిలోమీటర్లు కాలినడకన వెళుతోన్న దృశ్యాలు మనస్సున్న ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. వలసకూలీలు కాలినడకన వెళ్లడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరూ వెళ్లొద్దని.. ఒకవేళ వెళ్లాలనుకునే వారికి రైలు సదుపాయం కల్పిస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు

లాక్‌డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..! లాక్‌డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..!

 రైలు లేదంటే బస్సులు..

రైలు లేదంటే బస్సులు..

వలసకూలీలకు ఇబ్బంది లేకుండా చూడాలని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇంటికి వెళ్లాలనుకునే కూలీలకు రైలు, లేదంటే బస్సు సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వలసకూలీలు కాలినడకన వెళ్లొద్దని ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పిస్తోందని కేసీఆర్ స్పష్టంచేశారు. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ నుంచి వలసకూలీల కాలినడకన వెళ్తుండటంతో ఈ మేరకు కేసీఆర్ స్పందించారు.

పనిలేకపోవడంతో..

పనిలేకపోవడంతో..

లాక్ డౌన్ వల్ల పనిలేకపోవడంతో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం సంగారెడ్డిలో గల ఐఐటీ వద్ద వలసకూలీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. తమను స్వస్థలాలకు పంపించాలని చేసిన నిరసనలు హైలెట్ అయ్యాయి. అయితే వలసకూలీలను ఆదుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

12 కిలోల బియ్యం, రూ.500

12 కిలోల బియ్యం, రూ.500

ఒక్కో కూలీకి 12 కిలోల బియ్యం, రూ.500 అందజేస్తోంది. కుటుంబంలో ముగ్గురు ఉంటే రూ.1500 అందజేసి.. 18 కిలోల బియ్యం అందజేస్తున్నారు. అయితే వారికి నగదు, బియ్యం సరిపోదని అంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో అద్దె, జీవనం కోసం సరిపోవని అంటున్నారు. భార్య, పిల్లలతో ఉంటున్నానని, ఇల్లు కిరాయి కట్టడం లేదు అని మహారాష్ట్రకు చెందిన మహ్మద్ హఫీజ్ అనే వలసకూలీ తన బాధను వివరించారు.

Recommended Video

Telangana, Andhra Likely To Experience Heatwave Conditions: IMD
హైదరాబాద్‌లోనే ఎక్కువ..

హైదరాబాద్‌లోనే ఎక్కువ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులన్నీ హైదరాబాద్‌లో నమోదవుతున్నాయి. గురువారం 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 26 కేసులు హైదరాబాద్‌లోనే రికార్డయ్యాయి. దీంతో వైరస్ కేసుల మొత్తం సంఖ్య 1699కి చేరింది. గురువారం 23 మంది మాత్రమే వైరస్ తగ్గి.. ఇంటికి చేరుకున్నారు. రాష్ట్రంలో 1036 మందికి వైరస్ తగ్గిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 618 మందికి చికిత్స అందిస్తున్నారు.

English summary
Telangana chief minister K. Chandrashekhar Rao on Thursday instructed officials concerned to ensure that no migrant worker should have to walk back home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X