వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8వ రోజు: జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చైనా పర్యటనలో భాగంగా ఎనిమిదో రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చైనా అంతర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహక మండలి(సీసీపీఐటీ) ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వనరులున్నాయని, పారిశ్రామిక రగంంలో విశిష్ట చరిత్ర ఉందని, దేశంలోనే ప్రముఖ రక్షణ, పరిశోధన సంస్ధలకు కేంద్రంగా ఉందని వివరించారు. స్మార్ట్‌ఫోన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ కంపెనీని సీఎం కేసీఆర్ తెలంగాణకు ఆహ్వానించారు.

అంతేకాదు ఔషధ రంగంలో తెలంగాణ అగ్రస్ధానంలో ఉందని, ఐటీలో హైదరాబాద్ నగరం పేరొందిందని, వైమానిక కేంద్రస్ధానంగా ఎదురుతోందని, బయోటెక్, ఆహారశుద్ధి రంగాల్లోనూ పెట్టుబడులకు అనుకూలతలున్నాయని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ గురించి వివరించారు.

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

ప్రపంచ వ్యాప్తంగా అన్ని పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి అన్నింటికంటే ఉత్తమంగా తమ విధానాన్ని రూపొందించామని, అంతర్జాతీయ స్ధాయిలో దీనికి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. గత రెండు నెలల వ్యవధిలోనే 56 పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అనుమతులు ఇచ్చామని తెలిపారు.

 జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

తెలంగాణలో పరిశ్రమల కోసం 1.60 లక్షల ఎకరాలకు కేటాయించామని, పారిశ్రామకి వేత్తలు ఎంపిక చేసుకన్న వెంటనే కేటాయింపులు జరుపుతామని తెలిపారు. కీలక రంగాలకు ప్రత్యేక విధానాలను చేపట్టామని, అనుమతులన్నింటిని సరళతరం చేశామని వెల్లడించారు.

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

ఇక 1952లో ఏర్పాటైన సీసీపీఐటీ ప్రధానంగా చైనా తరఫున ఇతర దేశాలతో వాణిజ్య సహకారం ఒప్పందాల విషయంలో కీలకపాత్ర పోషిస్తున్నది. దౌత్య వాణిజ్య సంబంధ అంశాల్లో సహకరిస్తుంది. సీసీపీఐటీ సమావేశం తర్వాత సీఎం బృందం షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్ (షిప్)ను సందర్శించింది.

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

షెన్‌జాన్ కేంద్రంగా మూడు వ్యాపార విభాగాలను నిర్వహిస్తున్నది. క్యారియర్ నెట్‌వర్క్స్, టెర్మినల్స్, టెలీకమ్యూనికేషన్స్ వీటిలో ఉన్నాయి. వైర్‌లెస్, ఎక్సేంజ్-ఆక్సెస్, ఆప్టికల్ ట్రాన్స్‌మిషన్, డాటా టెలీకమ్యూనికేషన్స్ గేర్, మొబైల్ ఫోన్స్, టెలీ కమ్యూనికేషన్స్ సాఫ్ట్‌వేర్ వంటి వివిధ అంశాలకు కంపెనీ విస్తరించింది.

 జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్ (షిప్)ను సందర్శించిన కేసీఆర్ దీన్ని అభివృద్ధి పరిచిన తీరుపై షిప్ ప్రతినిధులకు అభినందనలు తెలియచేశారు. 1996లో ఏర్పాటైన షిప్ చైనాలో ఐదో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.

 జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

నాన్సన్ జిల్లాలో 11.5 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ పార్క్ వ్యాపారవేత్తలకు అంతర్గత సేవలు, పరిశోధనలు, పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తుంది. దేశంలో ఎగుమతుల ఆధారిత హైటెక్ ఉత్పత్తులకు చైనా ప్రభుత్వంచే ఎంపికైంది.

 జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

దీంతోపాటు అసియా-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (అపెక్) హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్, అడ్వాన్స్‌డ్ స్టేట్ లెవెల్ హైటెక్ ఇండస్ట్రీ ఏరియా, నేషనల్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బేస్‌గా కూడా ఎంపికయింది. షిప్ సాధించిన విజయాలను సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

ఐబీఎం, ఫిలిప్స్, కాంపాక్, ఒలింపస్, ఎప్సన్, ల్యూసెంట్, హ్యారీస్ ఆండ్ థామ్సన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈ పార్క్ ఆకర్షించింది. చైనా దేశీయ కంపెనీల్లో పేరెన్నికగన్న హువాయ్, జెడ్‌టీఈ, లెనొవా, టీఎస్‌ఎల్, స్కైవర్త్, గ్రేట్‌వాల్, పవరైజ్ వంటి సంస్థలు కూడా ఇక్కడున్నాయి.

 జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

జెడ్‌టీఈ మొబైల్ కంపెనీలో సీఎం కేసీఆర్

ప్రస్తుతం కంప్యూటర్, టెలీ కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్, బయోలాజికల్ ఇంజినీరింగ్, న్యూ మెటిరియల్స్‌పై దృష్టి సారించి వాటిని అభివృద్ధి పరిచే దిశగా కృషిచేస్తున్నారు. ఈ పార్కులో పర్యటిస్తున్న సందర్భంగా కేసీఆర్ ఆయా కంపెనీల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

English summary
CM KCR China Tour Reaches 8th Day, He visits ZTE Mobile Company In Shenzhen Park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X