వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు.. అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

|
Google Oneindia TeluguNews

బడ్జెట్ సమావేశాల ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తోన్న సర్కార్.. నిధులను కూడా వాటికే కేటాయిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఆ దిశగా అడుగులేస్తోంది. 2020-2021 బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు.

cm kcr conducts meeting with officials about budget allocation..

శుక్రవారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ 6వ తేదీన ప్రసంగించారు. తర్వాత సభ వాయిదా పడనుంది. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపులకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దారు. బుధవారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఫైనల్ చేసినట్టు తెలిసింది.

అంతకుముందు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగం ప్రతిని అందజేశారు. సీఎం నిర్వహించిన సమీక్షలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు పాల్గొన్నారు.

English summary
cm kcr conducts meeting with officials about budget allocation 2020-2021 financial year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X