వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RULE OF LAW:సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఫైన్, ఓవర్ స్పీడ్‌కు జరిమానా, చెల్లించిన సీఎంవో

|
Google Oneindia TeluguNews

చట్టం ముందు అందరూ సమానులే. ప్రజలకు, ప్రభువుకు మధ్య తేడా లేదు. ఇలాంటి మాటలు నేతలు చెబుతుంటారు. కానీ అచరణలో మాత్రం కాస్త కష్టమే.. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం రుజువు చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు ఫైన్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఫైన్లు వేశారు. ఇతరుల మాదిరిగానే ఓవర్ స్పీడ్‌లో వెళ్లినందుకు జరిమానా వేశారు. దీంతో ప్రజలతో సీఎం కూడా సమానమేనని.. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరూ అతీతులు కారు అని తెలంగాణ పోలీసులు రుజువు చేశారు.

Recommended Video

KCR Convoy Challaned For Overspeed CMO Paid The Amount
4 ఫైన్లు..

4 ఫైన్లు..

మూడు ఫైన్లు మాత్రం హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కాగా.. మరోటి కోదాడ పరిధిలో రూల్స్ బ్రేక్ చేసినందుకు విధించారు. గతేడాది అక్టోబర్ 16వ తేదీన కోదాడ సమీపంలో శ్రీరంగాపురంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్ ఓవర్ స్పీడ్‌లో వెళ్లింది. అది అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డవడం... పోలీసు ఉన్నతాధికారుల సలహాతో సీఎం కాన్వాయ్‌కు ఫైన్ వేశారు.

ఈ ఏడాదే మూడు ఉల్లంఘనలు

ఈ ఏడాదే మూడు ఉల్లంఘనలు

ఈ ఏడాది మూడుసార్లు సీఎం కాన్వాయ్‌ సేమ్ రూల్స్ బ్రేక్ చేసింది. ఏప్రిల్ 15వ తేదీన మాదాపూర్ పరిధిలో కూడా కేసీఆర్ కాన్వాయ్ నిబంధనలను అతిక్రమించింది. ఓవర్ స్పీడ్‌లో వెళ్లడం రికార్డైంది. తర్వాత అదేనెల 29వ తేదీన టోలిచౌకి పరిధిలో కూడా నిబంధనలు బ్రేక్ చేశారు. జూన్ 1వ తేదీన నాలుగోసారి ఓవర్ స్పీడ్‌లో వెళ్లారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఫైన్లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో మరింత ఆలస్యం చేయకూడదని సీఎంవో భావించింది. వెంటనే నాలుగు ఫైన్లకు సంబంధించి రూ.4 వేల 140 జరిమాన చెల్లించింది. తర్వాత ఈ చలానాలో చూసిన సీఎం కాన్వాయ్ మొత్తం చెల్లించారని, నో పెండిగ్ చూపిస్తోంది. దీంతో చలాన్ పడ్డ చెల్లించామని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. మరింత ఆలస్యం చేస్తే.. నెటిజన్ల నుంచి ట్రోల్ తప్పదని సీఎంవో ఫైన్ చెల్లించినట్టు తెలుస్తోంది.

English summary
cm kcr convoy cross over speed limit in 4 times.. police issue challan after that cmo pay the amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X