హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ మరో సంచలనం, 105 మంది అభ్యర్థుల ప్రకటన, వారికి మాత్రమే నో టిక్కెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

    కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే

    హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారు. ఏకవ్యాక్య తీర్మానంతో కేబినెట్ ఆమోదం తెలపకా, సీఎం, మంత్రులు బస్సులో రాజ్ భవన్ వెళ్లి తీర్మానాన్ని ఆయనకు సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దుపై గత కొద్ది రోజులుగా జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో కేసీఆర్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. కేబినెట్ కూడా అలాగే కొనసాగనుంది.

    CM KCR dissolves Telangana Assembly live updates

    Newest First Oldest First
    5:27 PM, 6 Sep

    కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తానని చెప్పాడని, అది ఏమయిందని ప్రశ్నించారు.
    5:27 PM, 6 Sep

    అసెంబ్లీ రద్దుతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని బిగ్గెస్ట్ బఫూన్ అని కేసీఆర్ అంటున్నారని, కానీ ఆయనే పెద్ద బఫూన్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ బఫూన్ అన్నారు.
    4:50 PM, 6 Sep

    2014లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. కేసీఆర్ అనుభవరాహిత్యంతో తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. డబుల్ బెడ్రూంలో ప్రకటనకే పరిమితమయ్యాయని చెప్పారు.
    4:45 PM, 6 Sep

    కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని చెప్పారు. ప్రతిపక్షాలకు భయపడే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు.
    4:40 PM, 6 Sep

    తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
    4:31 PM, 6 Sep

    కేసీఆర్ కళ్లు నెత్తికెక్కినట్లుగా మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం,ముస్లీం రిజర్వేషన్లపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెరాసను చిత్తుగా ఓడించాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు.
    4:28 PM, 6 Sep

    రాహుల్ గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీపై విమర్శలు చేయడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారని చెప్పారు.
    4:12 PM, 6 Sep

    ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వారసత్వంగా వచ్చారన్నారు.
    4:12 PM, 6 Sep

    రాహుల్ గాంధీ భారత దేశంలోనే అతిపెద్ద బఫూన్ అని కేసీఆర్ అన్నారు. మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీ అన్నారు.
    4:06 PM, 6 Sep

    తెలంగాణ బీజేపీ నేతలు అంతు లేకుండా మాట్లాడుతారని విమర్శించారు. రేపు సాయంత్రం వరకు తనకు ప్రధాని కావాలని ఉంటే అవుతానా అని ప్రశ్నించారు.
    4:05 PM, 6 Sep

    గోత్రాలు కలవవని, బీజేపీతో కలిసేది లేదన్నారు. మజ్లిస్ మాత్రం ఫ్రెండ్లీ పార్టీ అన్నారు. కేంద్రంలో ఓ పార్టీ ఉన్నప్పటికీ అంశాల వారిగా మద్దతిస్తామని చెప్పారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో నితీష్ తనను అడిగారని, కానీ తమను అడగని వారికి ఎలా మద్దతిస్తామన్నారు. టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హైదరాబాదుకు వచ్చినప్పుడు మాట్లాడుతూ.. మజ్లిస్‌తో కలిసి ఉండే పార్టీ తమకు వద్దని చెప్పారని గుర్తు చేశారు.
    4:04 PM, 6 Sep

    ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. తమది ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ అన్నారు. పక్క రాష్ట్రం అతనే నేను 25 స్థానాలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని అన్నారని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ ఎద్దేవా చేశారు. తమ ఫ్రంట్ కచ్చితంగా బాగుంటుందని చెప్పారు.
    4:04 PM, 6 Sep

    డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకుడు అని కేసీఆర్ చెప్పారు. ఆయనకు పార్టీలో ఎంతో ఉన్నత స్థానం ఇచ్చామని చెప్పారు. ఆయన పార్టీలోకి వస్తానని చెబితే ఓకే చెప్పామని, అడ్వయిజర్‌గా చేశామని, రాజ్యసభ అడిగితే.. పెద్దాయన కదా అని ఇచ్చామని చెప్పారు. ఆయన పార్టీలో ఉంటే ఉంటడు.. వెళ్తే వెళ్తాడు.. ఆయన ఇష్టమని చెప్పారు.
    3:42 PM, 6 Sep

    తమకు వచ్చిన సర్వే ప్రకారం ప్రతిపక్షాలు తమ దరిదాపుల్లో కూడా లేరని కేసీఆర్ చెప్పారు. 82 నియోజకవర్గాలలో తాము 60 శాతానికి పైగా పైబడి ఉన్నామని, 100 నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా ఉన్నామని చెప్పారు. ఏడు నియోజకవర్గాలు ఎవరికి పోతాయా తెలుసునని అన్నారు. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ ప్రధాని కాబట్టి సంబంధాలు ఉంటాయని చెప్పారు. కానీ తాము బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని చెప్పారు. కానీ కొందరు తాను బీజేపీతో కలుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రగతి నివేదన సభలో తాను తాయిలాలు ప్రకటిస్తానని చెప్పారని, అది సరికాదన్నారు.
    3:42 PM, 6 Sep

    రాహుల్ గాంధీ భారత దేశంలోనే అతిపెద్ద బఫూన్ అని కేసీఆర్ అన్నారు. ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీని కౌగిలించుకున్నారని చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వారసత్వ నేత అన్నారు. తాము ఢిల్లీకి గులాం కాదల్చుకోలేదని చెప్పారు. 2014కు ముందు తెలంగాణలో బాంబు పేలుళ్లు, మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని చెప్పారు. మజ్లిస్, తాము ఫ్రెండ్లీ పార్టీ అని, తాము కలిసి పని చేస్తున్నామని తెలిపారు. కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసిన సమయంలో అసదుద్దీన్ తమకు అండగా నిలబడ్డారని చెప్పారు.
    3:30 PM, 6 Sep

    తాము మరో ఏడెనిమిది నెలలను త్యాగం చేసి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. రేపటి నుంచి మీకు (మీడియా) పని ఉంటుందని, వారు అరుస్తారు, మేం అరుస్తామని అన్నారు.
    3:21 PM, 6 Sep

    తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు. నవంబర్ 1 తెలంగాణకు బ్లాక్ డే అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి అందరూ మోసం చేశారన్నారు. ఉద్యమం సమయంలో వందలాది మందిని కాల్పించింది ఇందిరా గాంధీ అన్నారు.
    3:17 PM, 6 Sep

    చెన్నూర్, ఆందోల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
    3:13 PM, 6 Sep

    తనకు తెలిసి అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ (ముందస్తు) ప్రారంభమై నవంబర్‌లో ఎన్నికలు జరిగి, డిసెంబర్‌లో ఫలితాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఇతర నాలుగు రాష్ట్రాలతో ఎన్నికలు తెలంగాణకు జరుగుతాయన్నారు. మొత్తం 119 స్థానాలకు గాను 105 సీట్లు ప్రకటించానని, మిగతా 14 స్థానాలపై వారం, పది రోజుల్ సెటిల్ చేస్తామని చెప్పారు.
    3:08 PM, 6 Sep

    ఈ సందర్భంగా కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఆయన మీడియా ప్రతినిధులకు అందించారు. తాను కేవలం ఇద్దరికే టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. ఐదు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు ఉన్న చోట చర్చించాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడు చోట్ల మినహా అందరు సిట్టింగులకు టిక్కెట్లు ఇస్తున్నామని చెప్పారు. మేడ్చల్, మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో చర్చించాల్సి ఉందని తెలిపారు. ఇలా అసెంబ్లీని రద్దు చేస్తూనే అలా 105 మందిని ప్రకటించడం సంచలన విషయమే.
    3:06 PM, 6 Sep

    ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, పిచ్చిపిచ్చి పనులు చేశారని, అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లారని చెప్పారు. కొత్త రాష్ట్రం అనతికాలంలో ఎంతో ఆర్థికాభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలు ఎదుర్కొన్నామని, పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారన్నారు. తమపై ఒక్కటంటే ఒక్క ఆరోపణ లేదన్నారు. 35 ఏళ్లు కరెంట్‌తో ఇబ్బందులు పడ్డామన్నారు. కాంగ్రెస్ వారు రౌండ్ టేబుల్స్, వారి బొంద టేబుల్స్ పెట్టుకుంటున్నారన్నారు. తాము నిబ్దదతతో కరెంట్ సమస్యను పరిష్కరించామని చెప్పారు.
    3:06 PM, 6 Sep

    అనేక పోరాటాలు, త్యాగాల మీద తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.
    2:56 PM, 6 Sep

    పటిష్టమైన తెలంగాణ కోసం 2014లో తాము ఒంటరిగా పోటీ చేశామని కేసీఆర్ చెప్పారు. ఈ మధ్య తెలంగాణలో రాజకీయాల్లో అసహనం చూస్తున్నామని చెప్పారు. అది అవాంఛనీయం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక రాష్ట్రాల సీఎంలు మనలను పొగిడారని చెప్పారు. ఎకనామిక్స్ టైమ్స్ అవార్డు కూడా వచ్చిందన్నారు.
    2:54 PM, 6 Sep

    కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం కూర్చోగా.. పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయబోగా.. క్వశ్చన్లు తర్వాత, మేం చెప్పుకునేది చెప్పుకుంటామన్నారు.
    2:51 PM, 6 Sep

    ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తూ గెజిట్ విడుదలైంది.
    https://twitter.com/oneindiatelugu/status/1037630425093423104?ref_src=twsrc%5Etfw
    2:49 PM, 6 Sep

    కాసేపట్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.
    2:42 PM, 6 Sep

    ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నోటిఫికేషన్ జారీ చేశారు.
    2:35 PM, 6 Sep

    వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని చెప్పారు. ఆరు నెలలు ముందుగానే సరైన కారణం చెప్పకుండా సభను రద్దు చేశారన్నారు. ఈ నిర్ణయంతో తెరాస తన అంతాన్ని తానే కొని తెచ్చుకుందని చెప్పారు. ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు.
    2:22 PM, 6 Sep

    తెలంగాణకు ఈ రోజు దీపావళి అని, ఈ రోజుతో దుష్టపాలన అంతమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ తల్లికి గడీల పాలన నుంచి విముక్తి, దొరల దాష్టీకాలకు ఇక కాలం చెల్లిందన్నారు. రాబోయే ప్రజాస్వామ్య ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ ప్రగతి, ప్రజాస్వామ్యవాదులు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
    2:18 PM, 6 Sep

    మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా సమావేశంలోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
    https://twitter.com/oneindiatelugu/status/1037622539432779776
    READ MORE

    English summary
    Governor ESL Narasimhan approves assembly dissolution as recommended by CM KC Rao. Governor has asked Rao to continue as caretaker Telangana CM till the new government is formed.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X