హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన కేసీఆర్: విశేషాలు(వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అధికారిక నివాసంలోకి గురువారం ఉదయం 5గంటల 22నిమిషాలకు గృహప్రవేశం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అధికారిక నివాసంలోకి గురువారం ఉదయం 5గంటల 22నిమిషాలకు గృహప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి 'ప్రగతిభవన్‌'గా నామకరణం చేశారు.

నిజమే?: కేసీఆర్ కోసం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్, హెవీ సెక్యూరిటీ!నిజమే?: కేసీఆర్ కోసం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్, హెవీ సెక్యూరిటీ!

ఈ కార్యక్రమానికి చినజీయర్‌స్వామితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గృహ ప్రవేశంలో భాగంగా దైవప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశంను శాస్రోక్తంగా నిర్వహించారు.

ప్రగతిభవన్‌లో సీఎం నివాసం, సమావేశం మందిరం, క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. సమావేశ మందిరానికి 'జనహిత'గానామకరణం చేశారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఈ నూతన భవన సముదాయాలను నిర్మించారు.

CM KCR enters new house

రూ. 38 కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం జరిగింది. జనహిత మందిరంలో దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.

ఇది ఇలా ఉండగా, ఈ భవనంలో కేసీఆర్ కోసం నిర్మించినట్లుగా చెబుతున్న బుల్టెట్ ప్రూఫ్ బాత్రూమ్‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తను జాతీయ మీడియాలో సైతం ప్రధానంగా ప్రచురితం చేశాయి.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Thursday morning entered in his new house in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X