హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు: అందించిన కేసీఆర్, స్మితాకు కీలక బాధ్యతలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దులో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందజేశారు.

Recommended Video

Colonel Santosh Babu భార్య సంతోషి ని Deputy Collector గా నియమించిన KCR || Oneindia Telugu

అంతేగాక, సంతోషికి హైదరాబాద్, లేదా నగర పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆమెకు సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు సూచించారు.

సంతోషితోపాటు వచ్చిన 20 మంది కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

cm kcr gives deputy collector posting letter to colonel santosh babus wife

ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ డగులు లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్,
బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దీపిక, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహదారు రాజీవ్ శర్మ, తదితరులు హాజరయ్యారు.

ఇంతకుముందే సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ. 5 కోట్ల ఆర్థిక సాయం అందించడంతోపాటు, హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం కేటాయించారు. కాగా, జూన్ 15న సరిహద్దులో చైనా బలగాల దాడిలో కల్నల్ సంతోష్ బాబుతోపాటు 21 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

English summary
cm kcr gives deputy collector posting letter to colonel santosh babu's wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X