వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫారెస్ట్ అధికారిపై దాడిని ఖండించిన సీఎం కేసీఆర్... కోనేరు క్రిష్ణపై తీవ్ర ఆగ్రహాం...

|
Google Oneindia TeluguNews

ఆసీఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో విధి నిర్వాహణలో ఉన్న ఫారెస్ట్ అధికారులపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు..ఈ నేపథ్యంలోనే మహిళా అధికారిణిపై దాడి చేసిన జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణారావుపై తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంఘటనకు సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం ఆధికారులను ఆదేశించారు. ఇక ఇలాంటీ సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది.

మరోవైపు జరిగిన సంఘటనపై ఎఫ్‌డీవో రాజారమణారెడ్డి ఎస్పీ మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ మల్లారెడ్డి కాగజ్‌నగర్‌లో పర్యటించారు. అటవీశాఖ అధికారులపై జరిగిన దాడిపై విచారణ జరుపారు...ఈ నేపథ్యంలోనే ఆయన స్థానిక పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కాగా దాడి ఘటనపైవిచారణ చేపట్టిన ఎస్పీ.. ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

CM KCR has strongly condemned the attack on the Forest Officers

కాగా సంఘటనపై ఆధికారులే దాడులు చేశారని ఎదురు దాడి చేసిన కోనేరు క్రిష్ణ పై స్థానిక నాయకుల నుండి ఒత్తిడి పెరగడంతో తన పదవులకు రాజీనామ చేశారు.తన జడ్పీటీసీతోపాటు ,జడ్పి వైస్ చైర్మన్ పదవులకు రాజీనామ చేసి కలెక్టర్‌కు అందించాడు.

CM KCR has strongly condemned the attack on the Forest Officers

కాగజ్‌నగర్ మండలం, సార్సాలలో అటవీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీరణ పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భూములను చదును చేసేందుకు ట్రాక్టర్లతో పాటు అటవి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు..అనంతరం భూములను దున్నేందుకు ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ.. ఘటనాస్థలికి వచ్చారు. అటవీ అధికారులను అడ్డగించారు. ఈ క్రమంలో అధికారులు, కృష్ణ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈనేపథ్యంలోనే క్రిష్ణతోపాటు పలువురు రైతులు ఎఫ్ఆర్‌వో అనితపై కర్రలతో దాడులు చేశారు.

English summary
CM KCR has strongly condemned the attack on the Forest Officers on duty in the Kajajnagar Asifabad district.The CM has directed the authorities to conduct investigation into the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X