• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డైలామాలో కేసీఆర్... జనాల్లో కన్ఫ్యూజన్... హైదరాబాద్‌లో లాక్ డౌన్‌‌పై కీలక అప్‌డేట్స్...

|

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో గత రెండు వారాలుగా 900కి కాస్త అటు ఇటుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై రెండు,మూడు రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారన్న కథనాలు వచ్చాయి. జూలై 1 లేదా 2 తేదీల్లో కేబినెట్ సమావేశం ఉండవచ్చునని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటికీ కేబినెట్ భేటీపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో ప్రజలకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సేఫ్ కాదని భావిస్తున్నవాళ్లు గ్రామాలకు తరలిపోతున్నారు. ఇక్కడే ఉండాలనుకున్నవాళ్లు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎలాంటి పంథా అనుసరించాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది.

ఫామ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి చర్చలు...

ఫామ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి చర్చలు...

ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా గజ్వేల్‌లోని తన ఫామ్ హౌజ్‌లో ఐఏఎస్‌లు,వైద్యా నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించిన చెన్నై,బెంగాల్‌లో పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాల్లోనూ మరోసారి లాక్ డౌన్ విధించిన దేశాల్లో... ఆ తర్వాత ఎలాంటి ఫలితం కనిపించిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ హైదరాబాద్‌లో లాక్ డౌన్ విధిస్తే రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.. ఒకవేళ లాక్ డౌన్ విధించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ చర్చోపచర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఖజానా గురించి కూడా ఆలోచిస్తున్న ప్రభుత్వం...

ఖజానా గురించి కూడా ఆలోచిస్తున్న ప్రభుత్వం...

దాదాపు 55 రోజుల లాక్ డౌన్ పీరియడ్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం చాలావరకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది తలెత్తడంతో 50శాతం వేతనాలతోనే సరిపెట్టారు. అన్‌లాక్ 1.0 తర్వాత హైదరాబాద్ నుంచి ఆదాయం రావడం మొదలవడంతో... రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడింది. జూలై నెలకు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి గ్రేటర్ పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే ఆదాయం పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న రెవెన్యూ,ఎక్సైజ్ యాక్టివిటీస్ పూర్తిగా నిలిచిపోతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తితే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి లాక్ డౌన్ పెట్టాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఒక్కపూట అనుమతి... ఒక్క పూట కర్ఫ్యూ..

ఒక్కపూట అనుమతి... ఒక్క పూట కర్ఫ్యూ..

హైదరాబాద్‌లో ఒకవేళ లాక్ డౌన్ పెట్టకపోతే కరోనా నియంత్రణ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ అన్ని యాక్టివిటీస్‌కు అనుమతినిచ్చి... ఆ తర్వాత కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అలా అయితే అన్ని రకాల కార్యకలాపాలు ఒక్క పూటకే పరిమితమై కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉండవచ్చునని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కంటైన్‌మెంట్ చర్యలపై...

కంటైన్‌మెంట్ చర్యలపై...

గత లాక్ డౌన్ పీరియడ్‌లో లాగా... కంటైన్‌మెంట్ ప్రాంతాలను పూర్తిగా లాక్ చేసి... టెస్టుల సంఖ్యను పెంచితే ఫలితం ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడైనా కరోనా పాజిటివ్ కేసు నమోదైతే... ఆ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ వరకే కంటైన్‌మెంట్ చేస్తున్నారు. అలా కాకుండా మళ్లీ పాత పద్దతినే అనుసరించాలా అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టెస్టుల సంఖ్యను పెంచడం,టెస్టుల ఫలితాలను కూడా వేగవంతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ విధిస్తే గతంలో లాగా ఇంటికి రూ.1500,బియ్యం ఇతరత్రా సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి... దానిపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  YSR జయంతి సందర్బంగా.. మరో కొత్త పధకం ప్రారంభించనున్న CM YS Jagan! || Oneindia Telugu
  మళ్లీ లాక్ డౌన్ విధిస్తే చితికిపోతామంటున్న పేదలు..

  మళ్లీ లాక్ డౌన్ విధిస్తే చితికిపోతామంటున్న పేదలు..

  హైదరాబాద్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలామంది నగరం నుంచి గ్రామాల బాట పట్టారు. ఇక్కడే ఉందామనుకునేవాళ్లు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ప్రకటించినా.. అందుకు సిద్దంగా ఉండేలా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రభుత్వం లాక్ డౌన్‌పై త్వరగా స్పష్టతనిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రజల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో త్వరగా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక పేద,దిగువ మధ్య తరగతి కుటుంబాలు.. మరోసారి లాక్ డౌన్ విధిస్తే తమ ఉద్యోగ,ఉపాధి దెబ్బతింటుందని వాపోతున్నారు. ఇప్పటికే 55 రోజుల లాక్ డౌన్‌తో ఇళ్ల అద్దెలు కట్టలేక,కుటుంబ పోషణ భారమై చితికిపోయి ఉన్నామని... ఇలాంటి స్థితిలో మళ్లీ లాక్ డౌన్ అంటే తమ పరిస్థితేంటని వాపోతున్నారు.

  English summary
  Telangana CM KCR continuously talking to IAS and health experts to take a decision over imposing lock down in Hyderabad. Peoples health and state economy are his two main concerns at this situation
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more