హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఎన్నో దశాబ్దాలుగా అన్నివర్గాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న నుమాయిష్-2016ను ప్రారంభిస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఆ తర్వాత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షత వహించారు.

 నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు

నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు


ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ప్రదర్శనలలో నుమాయిష్ అతిపెద్దదని అన్నారు. లీజు మీద కొనసాగుతున్న భూమిని సొసైటీ పేరు మీదుగా బదలాయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అంగీకరించారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు

నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు


కేటాయింపుల ప్రక్రియ తుదిదశకు చేరిందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ పర్యవేక్షణలో కొనసాగుతున్న 18 విద్యాసంస్థల్లో రాష్ట్రవ్యాప్తంగా 30వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ విద్య ప్రజలకు భారమవుతున్న తరుణంలో ఫీజులు భారం కాకుండా సొసైటీ ద్వారా పేదవారికి విద్యను అందిస్తున్నామన్నారు.

నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు

నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు


మారిన పరిస్థితులకనుగుణంగాఎగ్జిబిషన్ సొసైటీ తన పనితీరును మార్చుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని, వచ్చే ఏడాదికల్లా స్పష్టమైన మార్పులు తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అన్నిరంగాల పారిశ్రామిక, వ్యాపారవేత్తలు నుమాయిష్‌లో తమ ఉత్పత్తులను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకొంటామని అన్నారు.

 నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు

నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు

దేశంలోని అన్ని రాష్ర్టాల ఉత్పత్తులతో 2500 స్టాల్స్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. సందర్శకుల భద్రత కోసం ప్రత్యేకంగా సీసీటీవీ వ్యవస్థను ఏర్పాట్లు చేశామన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించడానికి అవకాశం కల్పించామన్నారు.

 నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు

నుమాయిష్ ప్రారంభం: 2500 స్టాల్స్ ఏర్పాటు

ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్య, పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అనిల్ స్వరూప్‌మిశ్రా, సంయుక్త కార్యదర్శి మార్గం ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

English summary
CM KCR Inaugurate Numaish Exhibition 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X