వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 నెలల తర్వాత సచివాలయం ప్రాంగణానికి సీఎం కేసీఆర్ -నిర్మాణ పనుల పరిశీలన -స్పీడప్ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు.

నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జలనిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల

CM KCR inspects new Secretariat construction, orders to Speed Up works

సచివలయ నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కేసీఆర్ సూచించారు. ప్రధాన గేట్‌తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని, డిజైన్లను సీఎం పరిశీలించారు. చివరిసారిగా 2019 జూన్ చివరి వారంలో సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం.. కొత్త భంతులకు శంఖుస్తాపన చేశారు. మళ్లీ 19 నెలల తర్వాత.. రిపబ్లిక్ డే నాడు ఆయనీ ప్రాంగణానికి వచ్చారు.

CM KCR inspects new Secretariat construction, orders to Speed Up works

కొత్త సచివాలయ నిర్మాణ పనుల సందర్శనలో సీఎం కేసీఆర్ వెంట ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఇ‌ఎన్‌సీ గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులున్నారు. కాగా,

CM KCR inspects new Secretariat construction, orders to Speed Up works

రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్న విష‌యం విదిత‌మే. రూ.617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించ‌నున్నారు. 2019లోనే శంకుస్థాపన జరిగినప్పటికీ, ముహుర్తబలం, కోర్టు చిక్కుల కారణంగా కూల్చివేత, కొత్త నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో పనుల వేగం పుంజుకోనుంది. అంతకుముందు..

ట్రంప్ కొత్త ఇన్నింగ్స్: ప్లోరిడాలో ఆఫీస్ ఓపెన్ -అభిశంసన తప్పదన్న ప్రెసిడెంట్ బైడెన్ట్రంప్ కొత్త ఇన్నింగ్స్: ప్లోరిడాలో ఆఫీస్ ఓపెన్ -అభిశంసన తప్పదన్న ప్రెసిడెంట్ బైడెన్

CM KCR inspects new Secretariat construction, orders to Speed Up works

సీఎం కేసీఆర్.. కొత్త సచివాలయ పనుల పరిశీలకు ముందు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసైతోకలిసి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనూ కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

English summary
Telangana Chief Minister K Chandrashekhar Rao visited and inspected the progress of the ongoing construction works of new Secretariat building complex on Tuesday. He examined every nook and corner of the work site and interacted with the engineers on the site and representatives of working agency. They were instructed to expedite the works and maintain the highest quality standards in construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X