• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్‌కు కొవిడ్ రోగుల జిందాబాద్ -వరంగల్ ఎంజీఎంలో సీఎం తనిఖీ -ఫేస్ షీల్డ్, అనూహ్య వినతులు

|

''కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం..'' అంటూ కొవిడ్ రోగి ముఖ్యమంత్రికి జైకొట్టిన దృశ్యం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కరోనా విలయకాలంలో రోగులు, ప్రజలకు భరోసా కల్పించడంతోపాటు మెడికల్ సర్వీసుల విస్తృతిని పెంచేదిశగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఆస్పత్రుల సందర్శనకు ఆసక్తికరంగా కొనసాగుతున్నది. మూడు రోజుల కిందట హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. నేడు(శుక్రవారం) వరంగల్ సిటీలోని ప్రఖ్యాత ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. అక్కడ..

వ్యాక్సిన్ల కొరతపై జగన్ షాకింగ్ కామెంట్స్ -'కొవాగ్జిన్' కుల ప్రస్తావన -అసెంబ్లీలో చంద్రబాబు, రామోజీపై నిప్పులువ్యాక్సిన్ల కొరతపై జగన్ షాకింగ్ కామెంట్స్ -'కొవాగ్జిన్' కుల ప్రస్తావన -అసెంబ్లీలో చంద్రబాబు, రామోజీపై నిప్పులు

రఘురామపై జగన్ సర్కారు సంచలనం -ఆ హక్కుంది కానీ, రక్తపాతం తలెత్తితే? -సుప్రీంలో కౌంటర్, ఇంకొద్ది గంటల్లోరఘురామపై జగన్ సర్కారు సంచలనం -ఆ హక్కుంది కానీ, రక్తపాతం తలెత్తితే? -సుప్రీంలో కౌంటర్, ఇంకొద్ది గంటల్లో

ఫేస్‌షీల్డుతో కొవిడ్ వార్డుకు..

ఫేస్‌షీల్డుతో కొవిడ్ వార్డుకు..

వరంగల్ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ డబుల్ మాస్కుతోపాటు ఫేస్ షీల్డును కూడా ధరించి నేరుగా ఐసీయూ వార్డులోకి, జనరల్ వార్డుల్లోకి వెళ్లారు. గాంధీకి వెళ్లినప్పుడు కేవలం మాస్కుతోనే వెళ్లిన ఆయన ఎంజీఎంలో మాత్రం ఫేస్ షీల్డ్ ధరించారు. అక్కడ చికిత్స పొందుతోన్న కొవిడ్ పేషెంట్లతో సీఎం మాట్లాడారు. అందుతున్న చికిత్స, భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. మహమ్మారికి భయపడొద్దని సీఎం అందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన వెంకటాచారి అనే కొవిడ్ రోగి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరిస్తూ.. ‘‘కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం'' అని నినదించాడు.

ఎంజీఎం విస్తరణ, అక్కడ కొత్త ఆస్పత్రి..

ఎంజీఎం విస్తరణ, అక్కడ కొత్త ఆస్పత్రి..

ఎంజీఎం ఆస్పత్రి సందర్శనలో భాగంగా పరిసరాలను పరిశీలించి, రోగులతో మాట్లాడిన తర్వాత అక్కడ అందుతోన్న సేవల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంజీఎంలో పనిచేస్తోన్న వైద్య సిబ్బందిని అభినందించారు. రోగులతో మాటా మంతి పూర్తయిన తర్వాత కొవిడ్ వైద్య సేవలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవనంపై సీఎం ఆరా తీశారు. కాకతీయ మెడికల్‌ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన దరిమిలా, ఎంజీఎం నుంచి వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు ప్రాంతానికి వెళ్లిన సీఎం.. జైలును శివారుకు తరలించే ఏర్పాట్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

 బస్తీదవాఖానల కోసం సీఎంకు వినతులు

బస్తీదవాఖానల కోసం సీఎంకు వినతులు

కరోనా వైద్య సేవల పరిశీలన కోసం వరంగల్ వచ్చిన ముఖ్యమంత్రికి వివిధ వర్గాల నుంచి అనూహ్యంగా వినతులు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్స్ తరహాలో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు మంచి ఆదరణ లభించడం తెలిసిందే. వరంగల్ సిటీలో ఇప్పుడున్నవాటికంటే అదనంగా మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సీఎంకు వినతులు వెళ్ళాయి. వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఉన్నారు.

English summary
To reach out to the COVID-19 patients and provide with confidence to the medical staff involved in treating them, Chief Minister, K. Chandrashekhar Rao visits mgm hospital in warangal on friday, cm interacted with covid patients and appreciates medical staff. kcr also reviews extension works of mgm and new hospital building at central jail place. ministers errabelli dayakar, satyavathi rathod among with cm ckr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X