• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ యోధుడు, కరోనాను జయిస్తారు -మంత్రి కేటీఆర్, చంద్రబాబు, ప్రముఖుల ప్రార్థనలు -ట్విటర్‌లో హోరు

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతుండగా, సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల దాకా వైరస్ బారినపడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(67) కూడా కొవిడ్ వ్యాధికి గురయ్యారని సోమవారం వెల్లడైంది. స్వల్ప లక్షణాలతో సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉన్నారని, నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. కాగా, కేసీఆర్ కరోనా కాటుకు గురయ్యారని వెల్లడైన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలనే సందేశాలతో ట్విటర్ మారుమోగిపోతున్నది..

షాక్: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ -ఫామ్‌హౌజ్‌లో ఐసోలేషన్ -సాగర్ సభ కొంపముంచిందా?

ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన మాట నిజమేనని ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా, కేసీఆర్ ధైర్యవంతుడని, గొప్ప యోధుడని, జనం ప్రార్థనలతో అతి త్వరలోనే వ్యాధి నుంచి కోలుకుంటారనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తామంతా కేసీఆర్ వెన్నంటే ఉన్నామని, ఈ సమయంలో సీఎం కోసం అందరూ ప్రార్థనలు చేయాలని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్ సందేశమిచ్చారు.

 cm kcr is a fighter, will recover from covid-19, says ktr, Twitter trends Get well soon msgs

కొవిడ్ బారి నుంచి సీఎం కేసీఆర్ తొందరగా కోలుకోవాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. టీఆర్ఎస్ శ్రేణులు సైతం వేల సంఖ్యలో గెట్ వెల్ సూన్ మెసేజ్ పోస్టులు పెడుతున్నారు. దీంతో కేసీఆర్ పేరుతో ట్విటర్ లో హోరు కొనసాగుతున్నది. స్వయంగా ముఖ్యమంత్రే కరోనా బారినపడటం రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితిని తెలయజేస్తున్నదని, తెలంగానలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ఇతరులు డిమాండ్ చేశారు.

కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు టీడీపీ చీఫ్ చంద్రబాబు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ ఎంసీ అర్వింద్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, సంగీత దర్శకుడు తమన్ సహా వందలాది మంది ట్వీట్లు చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 4009 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. మొత్త కేసులు 3,55,433కు మరణాల సంఖ్య 1838కి పెరిగాయి.

  YS Sharmila Arrest షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా స్పృహతప్పి YS Jagan రంగంలోకి దిగుతారా ?

  English summary
  as telangana chief minister and trs chief kcr tested positive for covid-19 positive on monday, thousands of messages for his well being on social media. several politicians and celebrities posts Get well soon messages for kcr. 'He is a gritty man and a fighter. Am sure he will recover soon with all of your prayers' says minister ktr.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X