హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్ (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హరిత తెలంగాణ సాధన కోసం అందరూ నడుంబిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో కదంబ మొక్కను నాటి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు హరితాభివందనాలు తెలిపారు.

లక్షన్నర మొక్కలు ఒకేసారి నాటడం గొప్ప సాహసోపేతమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అందరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. న‌ల్ల‌గొండ జిల్లాలో కోతులు ప్ర‌జల్లోకి వ‌చ్చి నానా హంగామా సృష్టిస్తున్నాయ‌ని త‌మకు ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు.

'కోతి అంటే అంజన్న కాబట్టి మనం వాటిని చంపం, అవేమో హంగామా చేస్తున్నాయి' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 'కోతులు మ‌న ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌స్తున్నాయి..? మ‌నం కోతుల జాగను పొల్లుపొల్లు చేసినం కాబట్టి.. అవి మనల్ని పొల్లుపొల్లు చేస్తున్నాయి..' అని ఆయ‌న అన్నారు.

రెండు వారాల పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మనకు చెట్లు పెంచడమే పనిగా పెట్టుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా అడవుల శాతం పెరుగుతుందని, మళ్లీ కోతులు వెనక్కి వెళ్లిపోతాయని ఆయన అన్నారు. చెట్టును పెంచడమంటే మనల్ని మనం బాగు చేసుకోవడమేన‌ని ఆయ‌న అన్నారు.

'వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 'ప్రతీ పాఠశాల ఆకుప‌చ్చ ఒడి కావాలె' అని ఆయ‌న ఆకాంక్షించారు. 'అడ్డగోలుగా వనాలని నాశనం చేసినందుకే మనకు వానలు లేకుండా పోతున్నాయి' అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కవులు, కళాకారులు కూడా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అంద‌రూ ఆకుప‌చ్చ మ‌హాయ‌���్ఞాన్ని చేప‌ట్టాలని కేసీఆర్ సూచించారు. పది రోజులు కష్టపడినా మొక్కలు పెరగలేదనే అపవాదు రాకుండా వాటిని కాపాడాలని సూచించారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

న‌ల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో మొక్క‌లు నాటి జిల్లాని ప‌చ్చ‌ని వ‌నంగా తీర్చిదిద్దాలని ఆయ‌న పిలుపునిచ్చారు. హరితహారంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షి���చారు. 'వాన‌లు కొనుక్కుంటే దొర‌క‌వు.. చెట్లు పెంచుకుంటే వస్తాయి' అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

ఉద్యమం ద్వారా ప్రజలు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తీరు అమోఘమని అన్నారు. తెలంగాణ గొప్ప జాతి అని కొనియాడారు. ఊహించని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తాను ఉద్యమం ప్రారంభించినపుడు పిడికెడు మందిమని గుర్తు చేశారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

తెలంగాణ వస్తదని దేశంలో ఎవరూ ఊహించలేదని తెలిపారు. జట్టు కడితే ఏం జరుగుతుందో నిరూపించిన ఘనత తెలంగాణ జాతిదని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పచ్చగా మార్చడానికి మనం కంకణం కడితే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమేనని పేర్కొన్నారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

పట్టుబట్టి హరిత తెలంగాణను సాధిద్దామన్నారు. వానలు కొనుక్కుంటే దొరికేవి కావని, పచ్చని అడవులు పెంచితేనే వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇకపై తెలంగాణలో కరెంట్ కోతలుండవని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అద్భుతంగా అమలు చేస్తున్నామని వివరించారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

జిల్లాలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో అతి తక్కువ అడవులు ఉన్నాయని, పచ్చదనం తక్కువగా ఉంది కాబట్టే ఇక్కడ నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

తాను నల్లగొండకు రావడంలో ఉద్దేశ్యం కూడా అదేనని తెలిపారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో అతి తక్కువ అడవులు ఉన్నాయని, పచ్చదనం తక్కువగా ఉంది కాబట్టే ఇక్కడ నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

తాను నల్లగొండకు రావడంలో ఉద్దేశ్యం కూడా అదేనని తెలిపారు. అందరిని ప్రోత్సహించి జిల్లాలో అడవుల శాతాన్ని పెంచేందుకు తాను వచ్చానని వివరించారు. అందరిని ప్రోత్సహించి జిల్లాలో అడవుల శాతాన్ని పెంచేందుకు తాను వచ్చానని వివరించారు. జిల్లాలోని కాలువల ఆధునీకరణ కోసం తక్షణమే రూ.350 కోట్లు కేటాయిస్తున్నానని ప్రకటించారు.

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

వర్షాలు కొంటే రావు, వనాలు పెంచితే వస్తాయి: హరితహారంలో కేసీఆర్

అంతక ముందు ప్రత్యేక బస్సులో చౌటుప్పల్ చేరుకున్న‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొక్కను నాటి నీరు పోశారు. యార్డులో నూత‌న‌ గోదామును ఆయ‌న‌ ప్రారంభించారు. అనంతరం నల్గొండ జిల్లాలోన��� గుండ్రాంపల్లి గ్రామానికి చేరుకున్నారు.

English summary
CM KCR To Launch Haritha Haram Program In Gundrampally Village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X