కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశానికి దిక్సూచి: ‘రైతుబంధు’పై కేసీఆర్, అగ్రకులాలకు అండ, వారి గొంతు లేస్తోందేం?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చెక్కులు, పాస్‌పుస్తకాలు అందించేందుకు రాత్రింబవళ్లు కృషి చేసిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏకైక తెలంగాణే

ఏకైక తెలంగాణే

తెలంగాణ వస్తే చీకట్లేనని కొందరు హేళన చేశారని, కానీ, ఇప్పుడు 24గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కేసీఆర్ అన్నారు. అలాగే 20శాతం సొంత రాబడి కలిగిన రాష్ట్రం కూడా తెలంగాణేనని చెప్పారు. యావత్ దేశానికి తెలంగాణ ఓ దిక్సూచి అని కేసీఆర్ అన్నారు.

 బంగారు పంటలు

బంగారు పంటలు

రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ. 8వేలు రైతులకు ఇస్తున్నామని చెప్పారు. ‘వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు ఇచ్చే డబ్బు రూ.6 వేల కోట్లు బ్యాంకులో ఉన్నాయని సీఎం చెప్పారు. పాస్‌బుక్కులు, చెక్కులు అందించడానికి కృషి చేసిన అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు పెట్టుబడి కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. పెట్టుబడి సహాయం సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలి' అని కేసీఆర్ రైతులను కోరారు.

దేశానికి దిక్సూచి

దేశానికి దిక్సూచి

‘వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి.. నీళ్లుండాలి..కరెంట్ ఉండాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేసినం, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి పంట పెట్టుబడి కూడా అందజేస్తున్నాం' అని తెలిపారు. నేడు యావత్‌దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

వ్యవసాయంతో జాతీయ ఉపాధి హామీ అనుసంధానం

వ్యవసాయంతో జాతీయ ఉపాధి హామీ అనుసంధానం

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం వేదిక నుంచి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం కేంద్ర ప్రభుత్వం భరించాలి, సగం రైతు భరించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలను కేసీఆర్ అందించారు.

కాంగ్రెసోళ్ల నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయా?

కాంగ్రెసోళ్ల నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయా?

కాంగ్రెస్ వాళ్ల మాటలు వింటే ఆగమవుతరు. ఆంధ్రా నాయకుల తొత్తులుగా ఉండి టీ కాంగ్రెస్ నేతలు వ్యవసాయాన్ని నాశనం చేశారని సీఎం విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరూపాయి కూడా ఇవ్వనంటే ఒక్క నేత కూడా కిక్కురుమనలేదని, ఆనాడు నోరు మూసుకున్న నాయకులు నేడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు' అని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వద్దు అంటున్నరో కాంగ్రెస్ నేతలు చెప్పాలని సీఎం ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లతో మూడు పంటలు పండించుకోబోతున్నామని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.

 అగ్రవర్ణాల పేదలను ఆదుకుంటాం

అగ్రవర్ణాల పేదలను ఆదుకుంటాం

తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. అగ్రకులాల్లోని పేదలను కూడా ఆదుకుంటామని అన్నారు. వారికి కోసం త్వరలోనే తగిన పథకాలు ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలపై కేసీఆర్ మండిపడ్డారు.

కొత్త రిజిస్ట్రేషన్ విధానం

కొత్త రిజిస్ట్రేషన్ విధానం

జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పోను మిగతా 430 మండలాల్లో ఎమ్మార్వోలే రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎం తెలిపారు. పోస్టులోనే రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్‌బుక్కులు ఇంటికొస్తయన్నారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసినమని, కనివినీ ఎరగని రీతిలో భూరికార్డుల ప్రక్షాళన చేసినమని అన్నారు. 58 లక్షల మంది రైతులకు పాస్‌బుక్కులు, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నం. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని సీఎం తెలిపారు. వ్యవసాయం పండగ అని తెలంగాణ చేసి చూపెట్టాలని రైతులకు సూచించారు. కాగా, పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరే ఉంటుంది కానీ అనుభవదారు పేరుండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో పాస్‌బుక్కులు తీసుకోవద్దన్నారు. కౌలు రైతులకు డబ్బు ఇవ్వమని సీఎం తెలిపారు. కోటి 40 లక్షల ఎకరాల పైచిలుకు భూమి సాగుకు అనుకూలంగా ఉందని తేలింది. చెక్కులు అందజేయడంలో ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలని రైతులకు సీఎం సూచించారు.
జూన్ 2 నుంచి రైతులకు 5లక్షల బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ధనికులైన రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలే అని సీఎం ఆకాంక్షించారు. మిషన్ భగీరథతో రెండు, మూడు నెలల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు.

English summary
Telangana Chief Minister KCR has launched the historic and game-changing Rythu Bandhu scheme at an impressive programme organized between Salapalli-Indiranagar in Huzurabad constituency of Karimnagar district. Over a lakh people have attended the meeting. Finance Minister Etela Rajender has personally monitored the arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X