హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో మరోసారి లాక్ డౌన్...? 2,3 రోజుల్లో తేల్చనున్న సీఎం కేసీఆర్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత సోమవారం(జూన్ 22) నుంచి శనివారం(జూన్ 27) వరకూ నమోదైన కేసులను పరిశీలిస్తే.. ప్రతీరోజూ వెయ్యికి దగ్గరగా కేసులు నమోదయ్యాయి. సోమవారం 872,మంగళవారం 879,బుధవారం 891,గురువారం 920, శుక్రవారం 985, శనివారం 1080 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులో జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఇలా కేసుల సంఖ్య పైకి ఎగబాకుతుండటంతో హైదరాబాద్ వాసుల్లో భయాందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ఆలోచన చేస్తోంది.

Recommended Video

CM KCR Hints Another Lockdown in Hyderabad? | Oneindia Telugu
అవసరమైతే మళ్లీ లాక్ డౌన్...

అవసరమైతే మళ్లీ లాక్ డౌన్...


హైదరాబాద్‌లో కేసుల తీవ్రత రీత్యా 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండు,మూడు రోజుల్లో పరిస్థితిని సమీక్షించి అవసరమైతే లాక్ డౌన్ ప్రకటిద్దామని ఆయన అధికారులతో అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే లాక్ డౌన్‌కి ముందు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేయాల్సి ఉంటుందని... ఆ తర్వాతే లాక్ డౌన్ విధించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈసారి మరింత కఠినంగా...

ఈసారి మరింత కఠినంగా...

అన్ని మెట్రో నగరాల్లో మాదిరే హైదరాబాద్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతోందని కేసీఆర్ పేర్కొనట్లు తెలుస్తోంది. చెన్నై లాంటి నగరాల్లో మోసారి లాక్ డౌన్ విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరో 2,3రోజుల్లో కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ అమలుచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పోలీస్ అకాడమీలో 124 మందికి కరోనా...

పోలీస్ అకాడమీలో 124 మందికి కరోనా...

తాజాగా తెలంగాణ పోలీసు అకాడమీలో 124 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ బారిన పడ్డవారిలో అటెండర్‌ స్థాయి నుంచి మొదలుకుని డీఐజీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వీరందరిని ఐసోలేషన్‌కు తరలించారు. అకాడమీలోని వంట మనిషికి మొదట కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసు అకాడమీలో 1900 మంది శిక్షణ పొందుతున్నందునా.. త్వరలోనే వీరికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బెడ్స్..

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బెడ్స్..


కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వేలాది బెడ్లు సిద్ధం చేశామని మంత్రి ఈటల రాజేందర్ తాజాగా వెల్లడించారు. సీరియస్‌గా ఉన్నవారికే ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వ్యాధి లక్షణాలు లేనివారికి ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని సూచించారు. తెలంగాణ కరోనా మృతుల సగటు 1.52 శాతం మాత్రమే ఉందని, తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈటల తెలిపారు.

English summary
Telangana government is discussing about the current scenario of covid 19 in the state especially in Hyderabad. CM KCR might be impose lock down if necessary in GHMC according to the sources
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X