చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు చెన్నైకి కేసీఆర్: థర్డ్‌ఫ్రంట్ కోసం కరుణానిధి, స్టాలిన్‌తో భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తమిళనాడు పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ చెన్నై బయలుదేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం డీఎంకే వర్కింగ్‌ ప్రిసిడెంట్‌ స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారు.

తృతీయఫ్రంట్‌ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలతో చర్చిస్తారు. కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ముఖ్యనేతలు కేశవరావు తదితరులు చెన్నై వెళ్లనున్నారు.

CM KCR to meet Karunanidhi

రాత్రికి అక్కడే బసచేసి ఎల్లుండి మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు. అంతేగాక, ఆదివారం ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను కూడా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో కలిసే అవకాశం ఉంది.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఇటీవల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌లతో వేర్వేరుగా సమావేశమైన విషయం తెలిసిందే.

English summary
Chief Minister K. Chandrashekhar Rao will meet former Chief Minister of Tamil Nadu M. Karunanidhi in Chennai on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X