వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన.... అమిత్ షాతో ముగిసిన భేటి , కాసేపట్లో... ప్రధానితో సమావేశం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటి ముగిసింది. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని జరిగిన సమావేశం, సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాల అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు షాకు వివరించినట్టు తెలుస్తోంది.. సీఎం రెండు రోజుల పర్యటనలో భాగంగా మరి కాసెపట్లో ప్రధాని నరేంద్రమోడీతో సీఎం కేసిఆర్ సమావేశం కానున్నారు.

ఇక అమిత్ షాతో జరిగిన భేటిలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారయణపేట్, జిల్లాలను నోటిఫై చేయాలని కోరడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమ్యలను కూడ పరిష్కరించాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ది అంశాలపై చర్చినట్టు సమాచారం . ముఖ్యంగా షెడ్యుల్ 9,10 లో విభజన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టులపై కూడ ఆయనతో చర్చించారు.

CM KCR meeting ended with Union Home Minister Amit Shah, meets pm narendra modi

మరి కాసెపట్లో ప్రధాని నరేంద్ర మోడితో కూడ సీఎం కేసిఆర్ సమావేశం కానున్నారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై చర్చించడంతో పాటు, రెండు రాష్ట్రాలకు ముఖ్యమైన నదుల అనుసంధానికి నిధులను సమకూర్చాలని ప్రధానిని కోరనున్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానికి జాతీయ హోదా ప్రకటించాలని మరోసారి విజ్ఝప్తి చేయనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఘర్‌ఘర్ జల్ పథకాన్ని మిషన్ భగీరథను అనుసంధానంచేయాలని సీఎం ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. మరోవైపు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపైనా ప్రధానితో సీఎం చర్చించనున్నారు.

English summary
CM KCR meeting ended with Union Home Minister Amit Shah.and he meet pm narendramodi in the evening.part of his two-day visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X