వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో సీఎం కేసీఆర్ సభ; లక్షమంది జనసమీకరణ; గులాబీనేతల టార్గెట్ అదే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎవరికివారు మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అప్పుడే పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరింత బలం చేకూరుతుందని భావిస్తుంది.

ఆగస్ట్ 20న సీఎం కేసీఆర్ సభ .. జనసమీకరణకు సర్వ శక్తులు ఒడ్డుతున్న టీఆర్ఎస్

ఆగస్ట్ 20న సీఎం కేసీఆర్ సభ .. జనసమీకరణకు సర్వ శక్తులు ఒడ్డుతున్న టీఆర్ఎస్


అందులో భాగంగా ఆగస్టు 20వ తేదీన సీఎం కేసీఆర్ నేరుగా మునుగోడులో సభ ద్వారా రంగంలోకి దిగనున్నారు. ఇక సీఎం సభ సక్సెస్ చేయడం కోసం నియోజకవర్గం అంతా మండలాలు వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ఉప ఎన్నికలకు ముందు ఆగస్టు 20న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్వహించనున్న తొలి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

మునుగోడులో మూడు సార్లు సీఎం బహిరంగ సభ ప్లాన్ .. మండలాల వారీగా జనసమీకరణ

మునుగోడులో మూడు సార్లు సీఎం బహిరంగ సభ ప్లాన్ .. మండలాల వారీగా జనసమీకరణ

మునుగోడులో మూడుసార్లు సీఎం బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కనీసం ఒక్క మండలం నుండి 15 వేల మంది జనసమీకరణ చేయాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్గొండ జిల్లాకు ఇంఛార్జిగా ఇంధన శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని నియమించగా, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఒక్కో మండలానికి ఇంచార్జ్‌లుగా నియమించి లక్ష మందికిపైగా జన సమీకరణ చేయనున్నారు.

మండలాల వారీగా రంగంలోకి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు

మండలాల వారీగా రంగంలోకి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు

మునుగోడు మండల ఇన్‌చార్జిగా మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలను పార్టీ నియమించగా, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ నుంచి ప్రజలను సమీకరించే బాధ్యత మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్‌.భాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌లకు అప్పగించారు.చౌటుప్పల్ రూరల్ మండలానికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఎస్.సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , మర్రిగూడ మండలానికి భోంగిర్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.

జిల్లా ఎమ్మెల్యేలు అంతా మునుగోడులోనే

జిల్లా ఎమ్మెల్యేలు అంతా మునుగోడులోనే

ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి,దేవరకొండ శాసనసభ్యులు రవీంద్రనాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, యాదాద్రి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎ.సందీప్ రెడ్డిలను నాంపల్లి మండలానికి నియమించారు. నారాయణపురం మండలానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతలను ఇంచార్జిలుగా నియమించారు.

లక్ష జనసమీకరణ లక్ష్యం .. మొదటి సభతోనే బలప్రదర్శన చెయ్యనున్న టీఆర్ఎస్

లక్ష జనసమీకరణ లక్ష్యం .. మొదటి సభతోనే బలప్రదర్శన చెయ్యనున్న టీఆర్ఎస్

ప్రస్తుతం సీఎం సభను సక్సెస్ చేయడం కోసం వీరంతా మండలాల వారీగా జన సమీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహించనున్న మొదటి సభ ద్వారానే మునుగోడు లో టిఆర్ఎస్ బలాన్ని చూపించాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసమీకరణ మొదలుపెట్టారు. మొత్తం లక్ష మంది ఈ సభకు హాజరయ్యేలా ప్లాన్ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ముందుకు వెళుతుంది. ఈ సభ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు టీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో చూపించాలని ప్రయత్నం చేస్తుంది.

English summary
CM KCR meeting on 20th of this month in munugode. The TRS expected to mobilize 1 lakh people and make the meeting a success. TRS MLAs entered the field for that to create tension to opposition with meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X