వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రివర్గ విస్తరణ వేళ.. అరుణ్‌ జైట్లీతో కేసీఆర్‌ భేటీ, ఏం మాట్లాడుకున్నారంటే...

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం హస్తినలో చురుగ్గా అడుగులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం హస్తినలో చురుగ్గా అడుగులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీలో జైట్లీని కలువడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశముందని ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే, సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు, కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

CM KCR Meets Arun Jaitley.. Discuss various State Issues

పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రక్షణశాఖ భూములు అప్పగించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ జైట్లీని కలిశారని, ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు, కేంద్ర కేబినెట్‌ విస్తరణ అంశాలు చర్చించలేదని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. ఇద్దరి మధ్య జరిగిన చర్చలో జీఎస్టీ కూడా ప్రస్తావనకు వచ్చిందని, ప్ర‌జోప‌యోగ నిర్మాణాల‌పై జీఎస్టీ త‌గ్గించే అంశాన్ని ప‌రిగ‌ణిస్తామ‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని అరుణ్ జైట్లీ కేసీఆర్ తో చెప్పినట్లు తెలిసింది.

ప్యాట్నీ-శామీర్‌పేట్‌, ప్యారడైజ్‌-బోయిన్‌పల్లి ఫ్లైఓవర్‌ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని, సికింద్రాబాద్‌లో నూతన సచివాలయ నిర్మాణానికి భూసేకరణలో సహకరించాలని సీఎం కేసీఆర్‌ జైట్లీతో భేటీ అయ్యారని ఆ వర్గాలు చెప్పాయి. మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే.

జైట్లీతో సమావేశం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుపై సెప్టెంబ‌ర్ 9 న హైద‌రాబాద్ లో జ‌రిగే కౌన్సిల్ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని జైట్లీ తెలిపారని చెప్పారు. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కే నిర్మాణ ప‌నుల‌పై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి త‌గ్గించామ‌ని జైట్లీ తెలిపార‌ని, మళ్లీ 12 శాతం నుంచి 5 శాతానికి త‌గ్గించే విష‌యంలో ఆలోచించి ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి చెప్పారని సీఎం కేసీఆర్ వివ‌రించారు.

English summary
Finance Minister Arun Jaitley has assured the Telangana government that the GST Council would discuss the issue of lowering tax structure on public projects as requested by the state. According to an official release from the Chief Minister K Chandrasekhar Rao's office, Jaitley, who also hold the portfolio of Defence, agreed for transfer of defence lands to the state for the purpose of construction of new secretariat and expansion of roads.Rao today met Jaitley in the national capital. Telangana had earlier requested the Centre to transfer defence-owned Bison Polo ground in Secunderabad for the construction of new state secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X