వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి సీఎం కేసీఆర్... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర అర్ధిక పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రధానిమోడీతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనేపథ్యంనే ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా ఆర్ధిక శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. కేంద్రం నుండి వస్తున్న నిధులు, రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. రాష్టానికి రావాల్సిన వాటాలపై కేంద్ర ఆర్ధిక శాఖకు సీఎం లేఖ రాశారు.

ఈనేపథ్యంలోనే ఆయన పలు అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా కేంద్రంలో మంత్రులు చెబుతున్న మాటలకు ఇస్తున్న నిధులకు పొంతన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్రం నుండి వస్తున్న పన్నుల వాట చాల తక్కువగా ఉందని , రాష్ట్రాలనికి రావాల్సిన పన్నుల వాటా సుమారు 924 కోట్లు తగ్గిందని వివరించారు. కేంద్ర నిధులపై ఆర్ధిక శాఖ మంత్రికి లేఖను రాశారు. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే...రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతుందని అన్నారు.

 CM KCR meets Prime Minister Modi soon

కేంద్రంతో పాటు రాష్ట్రంలో పన్నుల వాటా తగ్గినందున అన్నిశాఖల్లో నిధులను తగ్గించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖలు తమ పరిధిలో ఖర్చులపై స్వియ నియంత్రణ పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అర్ధిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను రూపోందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఆర్ధిక పరిస్థితిని ఈనెల 11న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో చర్చించనున్నట్టు తెలిపారు.

English summary
CM KCR will meet Prime Minister Modi at Delhi for discussing on the economic situation of the state. apart from c.m conduct a review meeting with state officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X