హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరెంట్‌పై కారు డ్రైవర్‌ని అడిగా, కేసీఆర్ పనితీరు భేష్: రమణ్‌సింగ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ పనితీరు భేష్ అంటూ ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ప్రశంసించారు. కొత్త రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకుంటున్న మందస్తు చర్యలు బాగున్నాయని తెలిపారు.

శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రమణ్ సింగ్ మాట్లాడుతూ అత్యంత గడ్డు పరిస్థితి నుంచి కోతలు లేని విద్యుత్ సరఫరాచేసే స్థితికి తెలంగాణ చేరుకోవడం మామూలు విషయం కాదని అన్నారు. తాను హైదరాబాద్‌లో దిగగానే కారెక్కానని, డ్రైవర్‌ను రాష్ట్రంలో కరెంట్ పరిస్ధితి ఆరా తీశానని అన్నారు.

తన రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ కోతలు లేవని ఆ డ్రైవర్ చెప్పాడని రమణ్ సింగ్ తెలిపారు. గతంలో కరెంట్ కష్టం ఉండేదని, కేసీఆర్ సీఎం అయ్యాక కరెంట్ కష్టాలు పోయాయని ఆ డ్రైవర్ చెప్పడంతో తాను చాలా సంతోషపడ్డానని రమణ్ సింగ్ వివరించారు.

కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

ప్రతిరోజూ సగటున ఆరువేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే తెలంగాణలో కోతలు లేని విద్యుత్ సరఫరా మామూలు విషయం కాదని చెప్పారు. కేసీఆర్‌ను కలవగానే ముందు విద్యుత్ అంశమే ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.

 కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

ఇక సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2700 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇంతకుముందు చేసుకున్న ఒప్పందం మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాకు అవసరమైన లైన్ నిర్మాణ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఇద్దరు సీఎంలు నిర్ణయించారు.

 కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

రెండు రాష్ర్టాల్లోని ప్రజా పంపిణీ వ్యవస్థ, తదితర అంశాలపై చర్చ జరిగింది. చత్తీస్‌గఢ్‌లో నయా రాయ్‌పూర్ నిర్మాణ పురోగతిపై కేసీఆర్ రమణ్‌సింగ్‌తో ఆరా తీశారు. మీరు బాగా చేస్తున్నారు.

 కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

మీది రిచ్ స్టేట్ కూడా, మీలాగే మేము కూడా భవిష్యత్‌లో తయారవుతామని అన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ రమణ్‌ సింగ్‌కు శాలువా కప్పి చార్మినార్ జ్ఞాపికను అందజేశారు.

 కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ రవీందర్‌రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

English summary
CM KCR meets with Chhattisgarh CM Raman singh at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X