వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరి భేటి.... గవర్నర్ నర్సింహన్‌‌కు సీఎం కేసిఆర్ కృతజ్ఝతలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణకు కొత్త గవర్నర్‌‌గా తమిళసై సౌందర్‌రాజన్ నియమితులు కావడంతో ప్రస్థుత గవర్నర్ నర్సింహన్‌ను సీఎం కేసిఆర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్‌గా నర్సింహన్ పదవి బాద్యతల నుండి తప్పుకోనుండడంతో సుమారు గంటన్నర సేపు ఇద్దరి మధ్య భేటి జరిగింది. రాష్ట్ర అభివృద్దికి గవర్నర్ నర్సింహన్ అనేక సహయ సహాకారాలు అందించినందుకుగాను సీఎం కేసిఆర్ కృతజ్ఝతలు తెలిపారు.

cm kcr met governor Narsimhan,

ఇక రాష్ట్రాన్ని వీడీ వెళుతున్న ప్రస్థుత గవర్నర్ నర్సింహన్ ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆకాంక్షించారు. ఈసంధర్భంగా నరసింహన్‌తో ఉన్న అనుభూతులను పంచుకున్నకేటీఆర్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా నర్సింహన్ రాష్ట్రానికి అనేక విషయాల్లో దశనిర్ధేశనం చేశారని ఆయన తెలిపారు. ఇక అనేక సందర్భాల్లో పలు అంశాలపై నరసింహన్ గారితో సంభాషించే అవకాశం కలిగిందంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇక సుధీర్ఘకాలంగా గవర్నర్ నర్సింహన్ తెలుగు రాష్ట్రల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఆయన డిశంబర్ 27,2009న ఉమ్మడి అంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నర్సింహన్ బాద్యతలు చేపట్టారు. అనంతరం 2014లో రాష్ట్రం విడిపోయిన అనంతరం రెండు రాష్ట్రాకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు. ఈనేపథ్యంలోనే భారత దేశంలో ఎక్కువ కాలం గవర్నర్ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ బ్రేక్ చేశారు. గవర్నర్ గా నియమించినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ వివాదరహితుడిగా కొనసాగారు. దీంతో భారత దేశ చరిత్రలోనే ఎక్కువ కాలం గవర్నర్ సేవలు అందించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.కాగా కొద్ది రోజుల క్రితమే ఏపి నూతన గవర్నర్‌గా విశ్వభూషన్‌ను నియమించిన కేంద్రం తాజాగా తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళసై సౌందర్‌రాజన్‌ను నియమించారు.

English summary
cm kcr met governor Narsimhan,and cm kcr convey his thanks to governor for his cooparation in administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X