వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాంగం తప్పు చెప్పదు కానీ, హైదరాబాద్‌లో ఉండొద్దు, మోడీ అంగీకరించారు: కేసీఆర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన సమర్థవంతంగా ఉంటుందని, 5 నుంచి 8 మంది మంత్రులు తిరిగి మళ్లీ పదవి పొందడం కష్టమని చెప్పారు.

వర్షాలకు ఇబ్బంది ఉండదని, అక్టోబర్ నుంచి వర్షాలు పడతాయని చెప్పారు. పశు సంవర్ధ శాఖకు, దేవాదయ శాఖకు బాగాలేదన్నారు. అవినీతి ఆరోపణలు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్ బూమ్ ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడైనా చక్రం తిప్పగలరన్నారు. ఇటీవల ఆయన థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

పంచాంగం ఎప్పుడూ తప్పు చెప్పదు కానీ

పంచాంగం ఎప్పుడూ తప్పు చెప్పదు కానీ

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పంచాగం జ్యోతిష్యం కాదని, సైన్స్ అని చెప్పారు. కొన్ని రాశుల వారికి ఈసారి సీట్లు కష్టమని చెప్పారని, ప్రజల్లో ఉండి పని చేస్తేనే ఎవరికైనా సీట్లు వస్తాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని పంచాంగాలు అన్నీ ఎప్పుడూ తప్పు చెప్పవని, అన్నీ ఒకటే చెబుతాయని, అయితే ఎవరి ముందు పంచాగాన్ని వినిపిస్తుంటే వారికి అనుకూలంగా మాట్లాడే విధంగా కొంత చమత్కారాన్ని జోడించి పండితులు చెబుతుంటారని కేసీఆర్ అన్నారు.

పంచాంగకర్త శుభవార్త చెప్పారు

పంచాంగకర్త శుభవార్త చెప్పారు

భగవంతుడికి నమస్కరించి అన్ని సంవత్సరాల్లాగే ఈ ఏడాది కూడా ప్రజానీకానికి మంచి జరగాలని, మంచి వర్షాలతో పంటలు పండి రైతాంగం సంతోషంగా ఉండాలని, సర్వ ప్రజలు సకల సంతోషాలు కలిగి ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానని కేసీఆర్ అన్నారు.
పంచాగ కర్త ఒక శుభకరమైన వార్త చెప్పారని, తెలంగాణ రాష్ట్రం రాశి కర్కాటక రాశి అని, ఆదాయం 8, వ్యయం 2 అని అన్నారు.

ఎవరినీ పట్టుకునే పరిస్థితి లేదు

ఎవరినీ పట్టుకునే పరిస్థితి లేదు

తెలంగాణ బడ్జెట్‌ మిగులు రాష్ట్రంగా ఉంటుందని, రాబడి బాగుంటుంది కాబట్టి మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు అన్నారు. డీజీపీ, నాయిని నర్సింహారెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, తాము ఎవరినీ కొట్టే పరిస్థితిలేదని, ఎవరినీ పట్టుకునే పరిస్తితి లేదని, శాంతిభద్రతలు బాగుంటాయన్నారు. దుర్మార్గుల ప్రకోపం తగ్గుతుందని చెప్పారన్నారు.

హైదరాబాదులో ఎక్కువగా ఉండొద్దు

హైదరాబాదులో ఎక్కువగా ఉండొద్దు

సంతోష్‌ శర్మ చాలా చతురుడు అని, ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏ రాశి వారికి టిక్కెట్లు ఢోకాలేదని, ఏ రాశి వారికి ఇబ్బంది అవుతుందో చెప్పారని, మరి ఆయా రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని, టిక్కెట్టు సంపాదించుకోవాలంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండకుండా ప్రజల్లో ఉండి మంచి పేరు తెచ్చకుంటే ఆటోమేటిక్‌గా వస్తుంది కాబట్టి దానిగురించి గొడవలేదన్నారు.

తెలంగాణ మరొకరికి సాయం చేసే స్థితిలో

తెలంగాణ మరొకరికి సాయం చేసే స్థితిలో

తెలంగాణ మరొకరికి సాయం చేసే స్థితిలో ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి రాజ్యపుజ్యం 7, అవమానం 3గా ఉందని పంచాగాలు చెబుతున్నాయని తెలిపారు. ఆదాయం 8, ఖర్చు 2గా ఉంటుందని చెప్పారన్నారు. ఏతావాతా రాష్ట్రం వెలుగు జిలుగులతో వర్ధిల్లుతుందన్నారు. అద్భుతమైన సిరిసంపదలతో తెలంగాణ తులతూగుతుందని చెప్పినందుకు పంచాంగకర్తలకు కృతజ్ఞతలు అన్నారు.

మోడీ కూడా అంగీకరించారు

మోడీ కూడా అంగీకరించారు

తెలంగాణ అభివృద్ధి చెందుతూ జాతి నిర్మాణంలోను ప్రముఖ పాత్ర పోషిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అంగీకరించారని చెప్పారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.50వేల కోట్లకు పైగా ఇస్తుంటే మనకు రూ.24వేల కోట్లే వస్తోందని, ఇలా మన ఆదాయంతో మనల్ని మనం పోషించుకుంటూ దేశాన్ని అభ్యుదయ పథకంలోకి తీసుకెళ్తున్నామనే సంతృప్తి ఉందన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao and Ministers attends for Ugadi festival celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X