• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ అనుమతి కావాలే: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక మాన‌వ‌త్వం లేని మూర్ఖుడు అని, తప్ప తాగి ఫామ్ హౌజ్ లో పడుకున్నాడని భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు. ఇటీవ‌ల స‌రూర్‌న‌గ‌ర్ లో ప‌రువు హ‌త్య‌కు గురైన నాగ‌రాజు కుటుంబ స‌భ్యుల‌ను వికారాబాద్ జిల్లా మ‌ర్ప‌ల్లిలో ఆయ‌న ప‌రామ‌ర్శించారు. నాగ‌రాజు కుటుంబానికి బీజేపీ అండ‌గా నిల‌బ‌డుతుంద‌ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రుగుతున్న హ‌త్య‌లు, అత్యాచారాల వెన‌క తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లే కార‌ణ‌మ‌ని ఆరోపించారు.

జాతీయ ఎస్సీ క‌మిష‌న్ ఆదేశించినా చ‌ర్య‌ల్లేవు

జాతీయ ఎస్సీ క‌మిష‌న్ ఆదేశించినా చ‌ర్య‌ల్లేవు

అనంత‌రం మీడియాతో మాట్లాడిన బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నాగరాజును కిరాతకంగా చంపేసినా ప్ర‌భుత్వం స్పందించక పోవడం దారుణమ‌ని, బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం తోపాటు రూ.8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించింద‌ని, అయినా ఇంత‌వ‌ర‌కు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమ‌న్నారు.

త‌ప్ప‌తాగి ప‌డుకున్నాడు

త‌ప్ప‌తాగి ప‌డుకున్నాడు

నాగరాజు కుటుంబ ప‌రిస్థితి, ఆర్థిక ప‌రిస్థితి ద‌ళిత సోకాల్డ్ సంఘాల‌కు క‌న‌ప‌డ‌టంలేదా అని ప్ర‌శ్నించారు. ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయిలను చంపేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని, నాగరాజును నగరంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఒక వ‌ర్గానికి చెందిన‌వారు న‌రికి చంపితే కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. క‌నీసం ఆ కుటుంబాన్ని కేసీఆర్ ఎందుకు పరామర్శించడంలేద‌ని అడిగారు.

ఎంఐఎం అంటేనే వ‌ణుకుతున్న కేసీఆర్‌

ఎంఐఎం అంటేనే వ‌ణుకుతున్న కేసీఆర్‌

ఎంఐఎం నేతల పేరు వింటేనే కేసీఆర్ గజ గజ వణికి పోతున్నాడ‌ని, ఈ సీఎం పాతబస్తీ పోవాలంటే ఒవైసీ అనుమతి తీసుకోవాల్సిందేన‌ని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా? పోలీసులకు కూడా ఆయన తెలియదని కానిస్టేబుళ్లు చెబుతున్నార‌ని, మీకేమైనా తెలుసా? అని ప్ర‌శ్నించారు. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవ‌డంలేద‌ని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీనించాయ‌ని, ఇంకెంత మంది రక్తం చిందిస్తే కేసీఆర్ కళ్ళు చల్లబడతాయ‌న్నారు.

ఉగ్ర‌వాదుల ప్రేరేపిత చ‌ర్య‌

ఉగ్ర‌వాదుల ప్రేరేపిత చ‌ర్య‌

నాగరాజు ను హత్య చేసిన నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఏర్పాటు చేయలేద‌ని, కెసిఆర్ వ్యవహార శైలిపై దళితులంతా ఆలోచించాలని పిలుపునిచ్చారు. దళిత బిడ్డ నాగరాజు హత్యను పరువు హత్య గానో, రెండు కుటుంబాల మధ్య గొడవగానో చిత్రీకరించడం దారుణమ‌ని, ఇది ముమ్మాటికి వ్యక్తిగత హత్య కాద‌ని, ముస్లిం ఉగ్రవాదుల ప్రేరేపిత చర్య అని, హిందువులు ముస్లింలకు భయపడి ఉండేలా చేస్తున్న దుశ్చర్య ఇది అని బండి సంజ‌య్ అన్నారు.

ఎందుకు నోరు మెద‌ప‌డంలేదు

ఎందుకు నోరు మెద‌ప‌డంలేదు

మిర్యాలగూడలో ఇదే ప్రేమ వివాహం చేసుకున్న దళితుడిని హత్య చేస్తే గాయిగాయి చేసిన ఈ సోకాల్డ్ సంఘాలు దళిత బిడ్డ నాగరాజు విషయంలో ఎందుకు నోరు మెద‌ప‌డంలేద‌ని ప్ర‌శ్నించారు. లవ్ జిహాదీ పేరిట ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే ఈ నోళ్లు ఎందుకు ప్రశ్నించడం లేద‌న్నారు. నాగ‌రాజు హ‌త్య‌కేసులో ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంద‌న్నారు.

హిందూ స‌మాజాన్ని భ‌య‌పెడుతున్నారు

హిందూ స‌మాజాన్ని భ‌య‌పెడుతున్నారు

ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేశార‌ని, రెండేళ్ల క్రితం గుంటూరులో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడిని గురజాల వరకు ఛేజ్ చేసి, నరికి చంపార‌నే విష‌యాన్ని గుర్తుచేశారు. ఇలాంటి దుశ్చర్యలతో మొత్తం హిందూ సమాజాన్ని భయపెట్టి, తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ఎంఐఎం, ఆ పార్టీ సంకనాకే టీఆర్ఎస్ చేసిన కుట్ర ఇది అన్నారు.

చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చి మొరిగే అయ్యాకొడుకులు ఇప్పుడేమంటారు? ఈ ఫాల్తుగాళ్లు.. నాగరాజు హత్య గురించి నోరెందుకు మెదపడం లేదు? నిందితులను ఉరి శిక్ష వేయాలని నాగరాజు కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నకు స‌మాధాన‌మేద‌న్నారు.?

English summary
Bandi Sanjay visiting the family of the slain Nagraj..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X