వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..

|
Google Oneindia TeluguNews

కోపమొస్తే కారం పెట్టినట్లు మాట్లాడటం.. కరుణలో చేతికి ఎముక లేనట్లు వ్యవహరించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేమీకాదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ నానాటికీ బలపడుతుండటం, ఉద్యోగ, నిరుద్యోగుల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో గడిచిన మూడు రోజులుగా వరుసపెట్టి సంచలన నిర్ణయాలు వెలువరిస్తున్నారాయన. మంగళవారం మధ్యాహ్నమే వివాదాస్పద ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసిన సీఎం.. రాత్రికి మరో హ్యాపీ బాంబు పేల్చారు. ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్టును ముందస్తుగానే అందించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అటుఇటు అయినాసరే, సీఎం సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం..

బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామబ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ

 ఉద్యోగులు అందరికీ వరాలు..

ఉద్యోగులు అందరికీ వరాలు..

కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇదీ కార్యాచరణ..

ఇదీ కార్యాచరణ..

వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరి లోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.

 ధనిక రాష్ట్రం.. ఉద్యోగులే కీలకం..

ధనిక రాష్ట్రం.. ఉద్యోగులే కీలకం..

‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42శాతం ఫిట్ మెంట్ తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

వివాదాల వల్లే ఆలస్యం..

వివాదాల వల్లే ఆలస్యం..

‘‘ఆంధ్రప్రదేశ్‌తో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ గొడవలన్నీ పరిష్కారమయ్యాయి. కాబట్టి వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి. అన్నిశాఖల్లో వెంటనే డీపీసీలు నియమించాలి. పదోన్నతులు ఇవ్వగా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఎన్ని ఖాళీలుంటాయనే విషయంలో స్పష్టత వస్తుంది. శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి'' అని సీఎం ఆదేశించారు. ‘‘ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలనే విషయంలో అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది'' అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

 విభజన పీడ పూర్తిగా విరగడయ్యేలా..

విభజన పీడ పూర్తిగా విరగడయ్యేలా..

‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం చిక్కుముడిగానే ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా విధులు నిర్వర్తించే సౌలభ్యం కల్పించడానికి మార్గం సుగమమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. మార్చి నుండి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కావాలి'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రిటైర్మెంట్ నాటికే ఫైలు క్లియర్..

రిటైర్మెంట్ నాటికే ఫైలు క్లియర్..


‘‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి'' అని కేసీఆర్ సూచించారు. ‘‘ఉద్యోగులు దాదాపు 35 సంవత్సరాలపాటు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారు. అలాంటి ఉద్యోగులకు చాలా గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగి నుండి శాఖాధిపతి వరకు ఎవరైనా సరే పదవీ విరమణ పొందితే వారికి ఆ కార్యాలయంలోనే ఘనంగా సన్మానం జరపాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలకాలి. రిటైరైన రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండవద్దు. దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి'' అని సీఎం చెప్పారు.

 తెలంగాణలో కారుణ్య నియామకాలు

తెలంగాణలో కారుణ్య నియామకాలు

తెలంగాణ జీవనాడి సింగరేణి సహా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కారుణ్య నియామకాల్లో జాప్యం అత్యంత విషాదకరమని సీఎం కేసీఆర్ అన్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడినాసరే, ఉద్యోగుల విషయంలో కేసీఆర్ సంచలన రీతిలో నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్

English summary
amid new year gift, telangana Chief Minister KCR told good news to government employees. govt decided to increase the salaries and retirement age for employees of all departments. For this, a committee headed by CS Somesh Kumar was appointed by the CM. The committee will report to the government on various issues, including pay rises. The CM's office has issued a statement to this effect on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X