• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మల్లారెడ్డికి 'మంత్రి' పదవి టెన్షన్... అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్... సాగనంపేందుకే డిసైడ్ అయ్యారా?

|

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి 'పదవి' టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ రియల్టర్‌ను బెదిరించిన ఆడియో లీక్ కావడం... ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో... మల్లారెడ్డిపై సీఎం చర్యలు తీసుకోబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది. దీనిపై సీఎంను కలిసి వివరణ ఇచ్చుకునేందుకు గత రెండు,మూడు రోజులుగా మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇంతవరకూ ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మల్లారెడ్డి సంజాయిషీ వినేందుకు కేసీఆర్ విముఖత ప్రదర్శిస్తుండటంతో ఆయనపై వేటు తప్పదా అన్న చర్చ జరుగుతోంది.

ఆ గొంతు నాది కాదు : మల్లారెడ్డి

ఆ గొంతు నాది కాదు : మల్లారెడ్డి

రియల్టర్‌ను బెదిరించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి మల్లారెడ్డి ఖండిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఎవరో తన గొంతును ఇమిటేట్ చేసి ఈ చర్యకు పాల్పడ్డారని అంటున్నారు. లీకైన ఆడియో టేపులో ఉన్నది తన గొంతు కాదని చెబుతున్నారు. తానంటే గిట్టనివారే ఇలా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియడంతో మల్లారెడ్డికి టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను కలిసి వివరణ ఇచ్చుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి పదవి ఊడుతుందా?

మంత్రి పదవి ఊడుతుందా?

సీఎంను కలిసేందుకు ఇప్పటికే ఓసారి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ వద్దకు,ఓసారి ప్రగతి భవన్‌ వద్దకు మంత్రి మల్లారెడ్డి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు సందర్భాల్లో కూడా కేసీఆర్ ఆయన్ను కలిసేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అంతేకాదు,మల్లారెడ్డిని కనీసం లోపలికి కూడా పిలవలేదని తెలుస్తోంది. దీంతో గేటు బయటి నుంచే ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయారని సమాచారం. ఇటీవల తన సన్నిహితులతో 'నాకు మంత్రి పదవి ఊరికే రాలేదు... ముట్టజెప్తేనే వచ్చింది..' అంటూ మంత్రి వాపోయారని... ఆ విషయం కూడా కేసీఆర్ వరకూ వెళ్లిందన్న ప్రచారం సాగుతోంది. మల్లారెడ్డిపై కేసీఆర్ ఇంత ఆగ్రహంగా ఉండటంతో... ఇక ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సురభి వాణీదేవి,కవితకు మంత్రి పదవులు?

సురభి వాణీదేవి,కవితకు మంత్రి పదవులు?

ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సురభి వాణి దేవిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునన్న ప్రచారం కూడా జరుగుతోంది. వాణి దేవితో పాటు ఎమ్మెల్సీ కవితకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరిపై వేటు పడక తప్పదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఆ ఇద్దరిలో ఒకరు మల్లారెడ్డి అవుతారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆయన స్థానంలో సురభి వాణి దేవి లేదా కవితకు అవకాశం ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది.

గతంలోనూ మల్లారెడ్డిపై ఆరోపణలు...

గతంలోనూ మల్లారెడ్డిపై ఆరోపణలు...

మల్లారెడ్డిపై ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయనపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు,ప్రభుత్వ అధికారులను సైతం ఆయన ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో మంత్రి అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించగా... స్థానిక మున్సిపల్ కమిషనర్ మంగమ్మ అడ్డుకున్నట్లు గతంలో కథనాలు వచ్చాయి. అలా అడ్డుపడినందుకు మంత్రి ఆమెను బెదిరించారన్న ఆరోపణలున్నాయి. అందుకే డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని మరీ... ఆమె మళ్లీ సెక్రటేరియట్ విధుల్లో చేరారన్న ప్రచారం ఉంది. మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దూలపల్లి శామీర్‌పేట వరకు ప్రతీ వెంచర్‌లో ఆయన వాటా డిమాండ్ చేస్తున్నారని ఆ సంఘం ఆరోపించింది.

English summary
Minister Mallareddy is trying hard to meet CM KCR bu can't get his appointment. On Tuesday afternoon, KCR ended his Siddipet tour and went to the farm house. On Wednesday he Arrived at Pragati Bhavan. While the minister was trying to meet CM KCR at the farm house, Pragati Bhavan for these two days, it was learned that the appointment was not given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X