వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోగుల ఇక్కట్లు పట్టవా.. సమీక్ష కోసం 11 గంటలా.. సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపాటు

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల ఇబ్బందులపై హైకోర్టు మొట్టికాయలు వేస్తోన్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కేసీఆర్‌కు చీమకుట్టినట్లయినా లేదన్నారు. దీనిని బట్టి ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అన్నట్టు సీఎం వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు.

కరోనా వైరస్ నిర్మూలనపై పట్టించుకోని కేసీఆర్.. కొత్త సచివాలయ నిర్మాణంపై మాత్రం సుదీర్ఘంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. శుక్రవారం 11 గంటలు సమీక్షించిన వార్తా కథనాన్ని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదీ సీఎం కేసీఆర్ బాధ్యతారహిత్యం కాదా అని ప్రశ్నించారు. కొత్త సచివాలయంలో కార్యాలయాలు, పేషీలుు, అంతస్తుల విస్తీర్ణాలపై చర్చించేందుకు సమయం ఉంది కానీ.. రోగుల యోగ క్షేమాలు పట్టించుకునే తీరికలేదని మండిపడ్డారు.

 cm kcr not care corona patients: revanth redddy

Recommended Video

Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే 64 వేల పాజిటివ్ కేసులు రావడంతో పరిస్థితి భయంకరంగా ఉందని.. రేవంత్ అన్నారు. కానీ సీఎం మాత్రం పట్టించుకోవడం లేదు అని.. తొలుత మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరే తప్ప.. మళ్లీ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదన్నారు.

English summary
congress leader revanth reddy fire on cm kcr. he is not care of coronavirus patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X