హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చీటికి మాటికి కార్మికుల స‌మ్మెల వ‌ల్లే ఆర్టీసీకి న‌ష్టాలు వ‌స్తున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సమీక్ష జరిపారు. హోటల్ మారియట్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఆదాయానికి గండిపెడితే ఉద్యోగం నుంచి తొల‌గిస్తామ‌ని హెచ్చరించారు.

ఆర్టీసీ అభివృద్ధి కోసం ఆయన పలు సూచనలు చేశారు. ఆర్టీసీ ప్రయాణికుల ద్వారానే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానూ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటకశాఖతో ఆర్టీసీని అనుసంధానం చేసి ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

శబరిమల, కొండగట్టు, బెంగళూరు, తిరుపతి, షిర్డీ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రయాణికులకు దైవదర్శనం, వసతి విషయాల్లో ప్రాధాన్యమివ్వాలి. బస్సులపై వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు చేపటాలన్నారు. పర్యాటకశాఖతో ఆర్టీసీని అనుసంధానం చేయాలన్నారు.

జాతరలు, బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు విహారయాత్రల కోసం ఆర్టీసీ బస్సులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిమాండ్ ఉన్న రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు.

వరంగల్, నిజామాబాద్‌కు ఏసీ మినీ బస్సులు ప్రయోగాత్మకంగా నడపాలని సూచించారు. ఆర్‌ఎంలు, డీఎంలు ప్రతీ 15 రోజులకోసారి సమావేశం కావాలని ఆదేశించారు. బస్టాండ్‌లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నిత్యం 90లక్షల మంది ప్రయాణిస్తున్నా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయంటే కారణాలు విశ్లేషించాలన్నారు. పన్నులు చెల్లిస్తూ ప్రైవేటు బస్సులు లాభాలు ఆర్జిస్తుంటే ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ నుంచి గ్రేటర్‌ ఆర్టీసీకి ఏడాదికి కనీసం రూ.190 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు.

రాష్ట్రంలో 95 డిపోల్లో 5 మాత్ర‌మే లాభాల్లో ఉండ‌డం సిగ్గు చేటని ఆయ‌న వ్యాఖ్యానించారు. కార్మికులు ఆర్టీసీని కాపాడేలా ప‌ని చెయ్యాలని ఆయ‌న సూచించారు. ఆర్టీసీకి ఆదాయం పెంచేందుకు కొత్తగా ఈడీ రెవెన్యూ పోస్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రైవేట్ ఆపరేటర్లు నిబంధనలు పాటించకుపోడవం కూడా ఆర్టీసీ నష్టాలకు కారణంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం శక్తివంచన మేరకు నిధులు కేటాయిస్తోందన్నారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ బస్సులను జీహెచ్ఎంసీకి అప్పగించామన్నారు.

విద్యుత్ సంస్ధల్లా ఆర్టీసీని బలోపేతం చేసే బాధ్యత నాది అని కేసీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యంతో పాటు అధికారులు కూడా సహకరించాలని కోరారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ పెంచామన్నారు. అయినా సమ్మె చేస్తే నష్టాలు పెరుగుతాయని ఈ సందర్భంగా అన్నారు.

నష్టాల్లో ఆర్టీసీని నడపడం కంటే సంస్ధను మూసివేయడమే మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కార్మికులు సహకరిస్తేనే ఆర్టీసీని నడుపుదామని లేదంటే సంస్ధను మూసేస్తామని ఈ సమావేశంలో కేసీఆర్ ప్రతిపాదించినట్లుగా తెలిసింది. ఈ సమావేశానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఈడీలు, డీఎంలు, రీజియనల్ మేనేజర్లు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీని దేశంలో నెంబర్ వన్ చేద్దాం: మహేందర్‌రెడ్డి

అందరం కలిసికట్టుగా టీఎస్‌ఆర్టీసీని దేశంలో నెంబర్‌వన్‌గా తీర్చి దిద్దుదామని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందు కోసం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామని ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. హోటల్ మారియట్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆర్టీసీపై నిర్వహిస్తోన్న సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనలు, ఆదేశాలను పాటించి ఆర్టీసీని అత్యుత్తమ సంస్థగా తీర్చి దిద్దుదామని పేర్కొన్నారు.

కేసీఆర్‌తో ఎంపీ మురళీమోహన్ భేటీ

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

56 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో కేవలం వెయ్యి మంది మాత్రమే అధికారులు, 55 వేల మంది కార్మికులు అనే విషయాన్ని మరవరాదన్నారు. ఆర్టీసీ కార్మికులది, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదేనని తెలిపారు. ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నామన్నారు.

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

హైదరాబాద్‌లో ఆర్టీసీని జీహెచ్‌ఎంసీకి అప్పగించామన్నారు. కొత్త బస్సులు ఇచ్చాం, 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం, ఇంకా చాలా చేశామని తెలిపారు. ప్రభుత్వం ఎంత చేసినా ఇంకా నష్టలే వస్తే అసలు ఆర్టీసీ ఎందుకనే ప్రశ్న కూడా తల��త్తుతుందని అన్నారు.

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

ప్రైవేట్ ఆపరేటర్లకు రవాణా పర్మిట్లు ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తే తాను వ్యతిరేకించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడానికి ప్రధానికి లేఖ కూడా రాశానని తెలిపారు. ఆర్టీసీలో అవినీతిని పూర్తిగా తగ్గించాలని సూచించారు. దుబారా కూడా ���ేకుండా చూడాలన్నారు. టికెట్ ఇవ్వకుండా అవినీతికి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష: సిగ్గుచేటు, సమ్మెలొద్దు, ఉద్యోగం నుంచి తొలగిస్తాం

ఇంటర్ డిస్ట్రిక్ట్ పర్మిట్లు తీసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు నిబంధనలు పాటించకుండా పర్మిట్లను దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమంగా సర్వీసులను నడుపుతున్నారని అన్నారు. ఫలింగా ఆర్టీసీకి తీ��్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దీనిపై రవాణా, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రైవేట్ ఆపరేటర్లను క్రమబద్దీకరించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సీనీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 18 నుంచి 22 వరకు ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో నిర్వహించనున్న మహాకుంభాభిషేకానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి అంగీకరించిన కేసీఆర్ మహా కుంభాభిషేకానికి హాజరవుతానని మురళీమోహన్‌కు చెప్పారు.

English summary
CM KCR Plans To Run TSRTC In Profits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X