• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్షా 65 వేల కోట్ల అంచనాలతో: సంక్షేమం..సాగుకు ప్రాధాన్యత: వెంటాడుతున్న బకాయిలు..!!

|

2019-20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టనుంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ దాదాపుగా రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్‌ 30తో కాలపరిమితి ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 2019-20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించనుంది.

వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ ..

వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ ..

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ రూపకల్పన జరుపుతున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసారు. ఆర్దిక మాంద్యం ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఇకపై కొంత జాగ్రత్తలు తీసుకోక తప్పదని రాష్ట్రప్రభుత్వం డిసైడ్ అయింది. పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ అంకెల్లో చూస్తే రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోతపడవచ్చని తెలిసింది. ఎప్పటిలాగే బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనుండగా, నీటిపారుదల రంగానికి కొంత వరకు నిధులు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి సొంత పన్నుల ద్వారా రూ.8000-9000 కోట్ల వరకు రాబడి ఉంటుంది. ఇందులో ప్రతి నెలా అప్పులపై వడ్డీ చెల్లింపు కింద రూ.1500 కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు రూ.2000 కోట్లు; ఆసరా పింఛన్లకు రూ.420 కోట్లు, సబ్సిడీ బియ్యం కింద రూ.168 కోట్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌, ఇతర సంక్షేమ పథకాలకు రూ.200 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. అంటే.. ప్రతినెలా రూ.4500 కోట్ల నుంచి రూ.5000 కోట్ల వరకు వీటికే సర్దాల్సి వస్తోంది. మిగిలే రూ.3000-4000 కోట్లను వివిధ అభివృద్ధి పనుల బిల్లులకు చెల్లించాల్సి ఉంది.

పెండింగ్ హామీలకు నిధులు కేటాయిస్తారా..

పెండింగ్ హామీలకు నిధులు కేటాయిస్తారా..

ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా బడ్జెట్ ప్రతిపాదిస్తున్న సమయంలో వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా..ఇందులో ఒక్క రైతుబంధు పథకానికే మూడు నెలల మిగులు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. అదే విధంగా.. రుణ మాఫీని అమలు చేస్తే, మరో రెండు నెలల మిగులు నిధులు దానికి సర్దాలి. దీనికితోడు చాలా కాలం నుంచి పీఆర్సీ పెండింగ్‌లో ఉంది. పంచాయతీలకు కూడా నిధులను ఇకనుంచి నెలవారీగా ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తమకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలంటూ విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ వంటి శాఖలు ఇప్పటికే సర్కారుకు లేఖల మీద లేఖలు రాస్తున్న పరిస్థితి. అయితే నిధుల కటకట నేపథ్యంలో ప్రస్తుతం బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడంలేదు. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి రూ.27,535 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. సాగునీటి పారుదల 10 వేల కోట్లు...విద్యుత్తు 9335 కోట్లు..రోడ్లు, భవనాలు 1300 కోట్లు..రైతు బంధు బకాయిలు 2000 కోట్లు..

సంక్షేమ హాస్టళ్లు 1000 కోట్లు..పరిశ్రమల శాఖ 1500 కోట్ల బకాయిలు ఉన్నాయి.

భారీగా నిధుల సమీకరణ అవసరం..

భారీగా నిధుల సమీకరణ అవసరం..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలకు నిధులు సమీకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఆసరా పింఛన్లు 12,067 కోట్లు.. నిరుద్యోగ భృతి 1810 కోట్లు..రుణ మాఫీ 6000 కోట్లు..రైతు బీమా 850 కోట్లు

రైతు బంధు 12,000 కోట్లు అవసరం కానుంది. ఇక, ప్రభుత్వ రంగ సంస్థలకు 800 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు 600 కోట్లు.. ఆరోగ్య శ్రీ కోసం 300 కోట్లు.. విద్యా శాఖలో సర్వశిక్షకు 400 కోట్లు..పంచాయతీరాజ్‌ బిల్లులు 300 కోట్లు..మొత్తం బకాయిలు 27,535 కోట్లు ఉన్నట్లు తేల్చారు. దీంతో..ఇప్పుడు తాజాగా ప్రతిపాదిస్తున్న బడ్జెట్ లో వీటికి ఎలా సర్దుబాటు చేస్తారనేది కేసీఆర్ చిట్టా పద్దుల్లో తేలనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM KCR propose finance budget for the year 2019-20 with appx 1.65 lakh cr. Govt may gie priority for agriculture and welfare schemes. nearly rs 27,000 cr dues to be pay for different schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more