హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనా పర్యటన సక్సెస్: హైదరాబాద్‌కు కేసీఆర్, ప్రజలకు చవితి శుభాకాంక్షలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు చైనావెళ్లిన సీఎం కేసీఆర్ తన పది రోజుల పర్యటనను ముగించుకొని బుధవారం రాత్రి హైదరబాద్‌కు చేరుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న సీఎంకు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచే సిఎం నేరుగా అక్కడికి సమీపంలోని శ్రీరామనగర్‌కు వెళ్లారు. ప్రముఖ వాణిజ్యవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు షష్టిపూర్తి వేడుకల ముగింపు సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈనెల 7న ప్రత్యేక విమానంలో సిఎం బృందం చైనా వెళ్లి అక్కడ పది రోజులపాటు పర్యటించిన విషయం తెలిసిందే.

డాలియన్, షాంఘై, బీజింగ్, షెనజన్, హాంకాంగ్ దేశాల్లో సీఎం కేసీఆర్ బృందం పర్యటించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాల్లో సీఎం కెసిఆర్ స్వయంగా పాల్గొని రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానంలోని (టిఎస్-ఐపాస్) ముఖ్యాంశాలను వివరించారు.

చైనాలోని డాలియన్ నగరంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న ఒకే ఒక నేత సీఎం కేసీఆర్ మాత్రమే. సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి హాజరైన సభికులను ఆకట్టుకుంది.

రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

పది రోజుల చైనా పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండుగతో విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రజల సంకల్పం నెరవేరాలని ముఖ్యమంత్రి ప్రకటనలో ఆకాంక్షించారు.

హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

దేశ విదేశాల్లోని పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం రూపొందించిందని, దీన్ని వినియోగించుకొని తెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కేసీఆర్ కోరారు.

 హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అన్ని రకాల అనుమతులు సింగిల్ విండో విధానంలో జారీ చేయనున్నట్టు వివరించారు. ముఖ్యంగా అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేసే సంబంధిత అధికారులకు జరిమాన విధించేలా చట్టాన్ని చేశామన్నారు.

 హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

విద్యుత్, నీరు, సరిపడినంత భూమితో పారిశ్రామికవాడలు సిద్ధం చేశామని సీఎం వివరించగా, పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రపంచంలో ఇంతటి వినూత్నమైన పారిశ్రామిక విధానం మరెక్కడా లేదు అని స్పష్టం చేశారు.

 హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

లియోనింగ్ రాష్ట్రంలోని 30 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో 3 గంటలపాటు సమావేశమైన సీఎం కేసీఆర్ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని వారికి వివరించారు. దీనితో రూ.1000 కోట్లతో హెవీ డ్యూటీ పంపుల పరిశ్రమ స్థాపిస్తామంటూ లియో కంపెనీ చైర్మన్ అప్పటికప్పుడు ప్రకటించారు.

 హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌కు కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు

చైనా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు కేకే, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జీ జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌రెడ్డి, జంగినపల్లి సంతోశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ భగవత్ మహేశ్‌మురళీధర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, మిషన్ మేనేజర్లు జగదీశ్ రామడుగు, శివాని శంకర్ (సీవీఎస్)లతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు వెళ్లారు.

English summary
CM KCR Receives Grand Welcome at Shamshabad Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X