హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి వేడుకలు: సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బతుకమ్మ వేడుకల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ కలెక్టర్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

CM KCR Review meeting on Bathukamma Celebrations

బతుకమ్మలను తీసుకుని వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బతుకమ్మ వేడుకలు కావడంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందన్నారు.

రేపు ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మ ఉత్సవాల ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో అధికారులు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రత కోసం 2 వేల మంది పోలీసులను నియమించారు. 300 వీడియో కెమెరాలతో ఉత్సవ ర్యాలీలు చిత్రీకరణ చేపట్టనున్నారు. ట్యాంక్‌బండ్‌పై 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

English summary

 
 CM KCR Review meeting on Bathukamma Celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X