వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష... కొత్త నోటిఫికేషన్‌పై చర్చ

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమావేశం ప్రగతి భవన్‌లో కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఐకాస చేపడుతున్న సమ్మె ఉదృతమైన నేపథ్యంలోనే తాజా పరిస్థితులు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై మంత్రులు మరియు అధికారులతో సమావేశం అయ్యారు సీఎం కేసిఆర్ . ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు తీసుకునే చర్యలపై కమిటీలో చర్చించనున్నారు. కాగా సమావేశంలో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు.

ఆర్టీసీ సమ్మెకు బ్రేక్.. రెండు రోజుల విరామం.. బస్సులు ఫుల్లుగా నడిచేనా?ఆర్టీసీ సమ్మెకు బ్రేక్.. రెండు రోజుల విరామం.. బస్సులు ఫుల్లుగా నడిచేనా?

సమ్మె ఉదృతం కావడం, ప్రతిపక్ష పార్టీలు వారికి మద్దతు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆదివారం నాటీ సమావేశానికి కొనసాగింపుగానే ఈ భేటీ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీలో ప్రవేట్ వాహానాలు, కొత్త నియామకాల నోటిఫికేషన్‌పై సునిల్ శర్మ కమిటీ ఇచ్చిన విధివిధానపై ఇచ్చి నివేదికపై సీఎం పరిశీలించి నిర్ణయం తీసుకోన్నారు. సమ్మెలో పాల్గోన్న వారిని తొలగించిన నేపథ్యంలోనే నూతన ఉద్యోగాల భర్తిపై ప్రధానంగా చర్చ జరగనుంది.

 cm kcr review on RTC strike with higher officials.

కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బంది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏఏ కేటిగిరికి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా కేటిగిరిలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయడానికి నియామకం వుంటుందని ఆయన అన్నారు. మరోవైపు యాబై శాతం మేర ప్రవైట్ బస్సులకు అవకాశాలు కల్పించాలనే సూచన కూడ సీఎం కేసీఆర్ చేశారు. దీంతో ఇందుకు అనుగుణంగా రవాణ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

English summary
cm kcr once again met with the higher officials, and minister to discuss on RTC strike. and final discussion also going on with transport officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X