హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యాదగిరి గుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే వన్నెతెచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ప్రధాన గుట్టపై సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ప్రధాన ఆలయ ప్రాంగణం, నాలుగు మాడ వీధులు, నాలుగు రాజగోపురాలు, కాలినడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్, బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతం, ఈశాన్య దిశలో నిర్మించబోయే పుష్కరిణి, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ప్రధాన ప్రవేశ ద్వారం తదితర నిర్మాణాలపై తయారు చేసిన నమూనాలను ఆయన పరిశీలించారు.

ఆలయ ప్రాంగణంలోనే నాలుగువైపులా పాకశాల, అద్దాల మండపం, కల్యాణ మండపం, యాగశాల నిర్మాణాలకు తయారు చేసిన నమూనాలను కూడా కేసీఆర్ పరిశీలించారు. యాదగిరిగుట్టను సందర్శించినప్పుడు ఆర్కిటెక్ట్‌లకు ముఖ్యమంత్రి కొన్ని సూచనలను చేశారు. దానికి అనుగుణంగా తాజాగా తయారైన నమూనాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ప్రధాన ఆలయంతోపాటు చుట్టుపక్కల ఉన్న కొండలు, గుట్టలలో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేపట్టాలనే దానిపై కూడా సోమవారం జరిపిన సమీక్షలో స్పష్టత వచ్చింది.

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కళ్యాణ కట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే షాపులు, మండల దీక్ష చేసే వారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్స్‌లు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్ యధావిధిగానే ఉండాలని, మిగిలిన ప్రాంతమంతా ఆగమ శాస్త్రం నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సిఎం సూచించారు. ఆలయ పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు ఉండాలన్నారు.

 యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

గుట్టపై ఏకకాలంలో 30 వేలమంది భక్తులు కలియ తిరిగినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భక్తులు సేదతీరడానికి వీలుగా గుట్ట చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.

 యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

అతిథి గృహాలు, కాటేజీలు, అందమైన ఉద్యాన వనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్లడానికి వేరు, వేరుదారులు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. గుట్ట కింద భాగంలో 2500 మంది పట్టే విధంగా కళ్యాణ మంటపం నిర్మించాలన్నారు.

 యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్ చెరువును మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో అభివృద్థి చేయాలన్నారు. గుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సరిపడ మంచినీటి సరఫరా, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

యాదాద్రి ప్లాన్ రెడీ: రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు, థీమ్ పార్కు

సమీక్షా సమావేశంలో గుట్ట సిఇఓ కిషన్‌రావు, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఆలయ స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్ట్‌లు రాజు, పాల్గొన్నారు.

English summary
CM KCR review on Yadagirigutta in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X