
కేసీఆర్ నోట బంగారు భారతదేశం మాట; ఏపీలోనే ఇప్పుడు అంధకారం: నారాయణఖేడ్ లో కేసీఆర్
సింగూరు ప్రాజెక్టుపై నిర్మించనున్న సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం నారాయణఖేడ్ శివారులో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో నారాయణఖేడ్ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు కూడా ఉండేవారు కాదని, ప్రజల్లో పెద్దగా తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న ఆశ కూడా ఉండేది కాదని, కెసిఆర్ వస్తున్నాడు పోతున్నాడు, తెలంగాణ వస్తదా రాదా అన్న అనేక అనుమానాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసే వారని కెసిఆర్ వెల్లడించారు. తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశామని, ఉధృతంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన తెలిపారు.

బంగారు భారత దేశం నిర్మిద్దాం .. కేసీఆర్ పిలుపు
సీఎం
కెసిఆర్
బంగారు
భారతదేశం
అంటూ
కొత్త
నినాదాన్ని
వినిపించారు.
దేశంలో
అరాచకమైన,
అన్యాయమైన
పాలన
సాగుతోందని
నిప్పులు
చెరిగారు
ఈ
తరహా
పాలనకు
చరమగీతం
పాడాలని
అవసరముందని
బంగారు
భారత
దేశాన్ని
నిర్మించుకునే
దిశగా
అడుగులు
వేద్దాం
అంటూ
కేసీఆర్
పిలుపునిచ్చారు.
తెలంగాణ
సీఎం
కేసీఆర్
తెలంగాణ
రాష్ట్రాన్ని
సాధించుకునే
వరకు
బంగారు
తెలంగాణ
నినాదాన్ని
ఎత్తుకోగా,
ప్రస్తుతం
బంగారు
భారతదేశ
నినాదాన్ని
ఎత్తుకొని
జాతీయ
రాజకీయాలలో
ముందుకు
వెళ్లాలని
ప్రయత్నిస్తున్నారు.

అప్పుడు విమర్శలు చేసిన ఏపీలో ఇప్పుడు అంధకారం
తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడ్డాయని కొందరు దుష్ప్రచారం చేశారని, తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని విమర్శించారని, తెలంగాణ వస్తే రాష్ట్రం అందకారంగా మారుతుందని అవాస్తవాలు ప్రచారం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడు విమర్శలు చేసిన ఏపీలో ఇప్పుడు అధికారం ఉందని, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ను అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. తలసరి విద్యుత్ వినియోగం లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ప్రజలు ఇచ్చిన శక్తితోనే తాను ఇలా నిలబడ్డాను
పద్నాలుగేళ్ళు
పోరాడి
తెలంగాణ
రాష్ట్రాన్ని
సాధించుకున్నామని
పేర్కొన్న
కేసీఆర్
ప్రజలు
ఇచ్చిన
శక్తితోనే
తాను
ఇలా
నిలబడ్డానని
వెల్లడించారు.
రాష్ట్రంలో
విద్యుత్
సమస్యలు,
నీటి
సమస్యలు
తీరిపోయాయి
అని
ఆయన
పేర్కొన్నారు.
అన్ని
రంగాల్లోనూ
తెలంగాణ
రాష్ట్రం
ముందుకు
వెళుతుందని
సీఎం
కేసీఆర్
వెల్లడించారు.
సంగారెడ్డి
జిల్లాలో
4427
కోట్ల
రూపాయలతో
చేపట్టిన
ఎత్తిపోతల
పథకాల
ద్వారా
3.87
లక్షల
ఎకరాలకు
సాగునీరు
అందించనున్నట్లు
చెప్పారు.
రానున్న
రెండేళ్లలో
ప్రాజెక్టులను
పూర్తి
చేయాలని
ప్రభుత్వం
లక్ష్యంగా
పెట్టుకుందని
సీఎం
కేసీఆర్
వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీలకు 140 కోట్ల నిధులు
ఇక
ఇదే
సమయంలో
సంగారెడ్డి
జిల్లాకు
వైద్య
కళాశాలను
మంజూరు
చేశామని,
మరోసారి
సంగమేశ్వర
ఆలయానికి
వచ్చినప్పుడు
వైద్య
కళాశాలకు
శంకుస్థాపన
చేస్తానని
సీఎం
కేసీఆర్
పేర్కొన్నారు.
సంగారెడ్డి,
జహీరాబాద్
మున్సిపాలిటీలకు
50
కోట్ల
రూపాయల
చొప్పున
నిధులు
మంజూరు
చేస్తానని
కెసిఆర్
వెల్లడించారు.
మిగతా
ఆరు
నియోజకవర్గాలకు
25
కోట్ల
రూపాయల
చొప్పున
నిధులు
ఇస్తామని
కెసిఆర్
పేర్కొన్నారు.
సంగారెడ్డి
జిల్లాలోని
పంచాయతీలకు
20
లక్షల
చొప్పున
మొత్తం
140
కోట్ల
నిధులు
మంజూరు
చేస్తామని
కెసిఆర్
తెలిపారు.

అన్ని తండాలకు రోడ్లు వేస్తాం.. నిధుల విడుదల జీవోలు రేపే ఇస్తానన్న కేసీఆర్
సంగారెడ్డి జిల్లాలోని అన్ని తండాలకు రోడ్లను వేస్తామని పేర్కొన్న ఆయన నిధులు విడుదల చేస్తూ రేపు జీవోలు జారీ చేస్తామని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు కెసిఆర్. ఇక రైతుబంధు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతుందని, రైతులు మరణిస్తే ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు.