నిర్మించడం కష్టం.. కూల్చివేత ఈజీ, కేంద్రంపై కేసీఆర్ కన్నెర్ర
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల యాసంగి పంట కొనుగోలు నుంచి మొదలైన వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టిపోశారు. ఇవాళ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో కూడా మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇదీ మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు విరుచుకుపడ్డారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఏర్పాటు చేశారు. విందుకు కేసీఆర్ హాజరయ్యారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి రోగం వచ్చింది. చికిత్స చేయాలి. కేంద్రం రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కూల్చివేతలు సులువు. దేశాన్ని నిర్మించడం కష్టం. అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని సూచించారు. సమాఖ్య విధానంలో రాష్ట్రాలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

అల్లరి చేసే వాళ్ల ఆటలు సాగవు. తెలంగాణ ఏర్పడిన సమయంలో నీళ్ల సమస్య ఉండేదని కేసీఆర్ చెప్పారు. కరెంటు ప్రాబ్లమ్ కూడా ఏర్పడింది. కానీ ఆ సమస్యను అధిగమించామని చెప్పారు. మిగులు విద్యుత్ ఉందన్నారు. దేశమంతా ఇప్పుడు చీకటి అలముకుంది. తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని కేసీఆర్ కామెంట్ చేశారు. ఇదీ ప్రపంచం చూస్తోందని చెప్పారు. అదే మిగతా రాష్ట్రాలకు సమస్య ఎదుర్కొంటున్నాయని వివరించారు. వాస్తవానికి అన్నీ రాష్ట్రాలకు పవర్ ఇష్యూ ఉంది. ఏపీలో అయితే కొన్ని పరిశ్రమలకు పవర్ హాలీడే కూడా ఇచ్చారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.
విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. రైతుల పంటకు సంబంధించి మాత్రం పగటిపూట ఇస్తున్నారు. రాత్రి పూట త్రి ఫేజ్ పవర్ ఇవ్వడం వీలు కావడం లేదు. ఇళ్లకు, వాణిజ్య సముదాయాలకు పవర్ సప్లై జరుగుతుంది. గృహాలకు 15 నిమిషాల వరకు పవర్ ప్రాబ్లమ్ ఉంటుంది.. కానీ నిరంతరాయంగా లేకపోవడం అనే మాటే లేదు. ఇదే విషయాన్ని కేసీఆర్ నొక్కి వక్కానించారు.