వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల్లన్నసాగర్ మడతపేచీ: హామీలకు నో ‘2013’ చట్టానికి సై

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం రిజర్వాయర్ కింద మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. కానీ మడత పేచీలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం రిజర్వాయర్ కింద మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. కానీ మడత పేచీలు మాత్రం పరిష్కారం కావడం లేదు. మల్లన్న సాగర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల రైతులతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జరిపిన చర్చలు అసంపూర్తిగా మిగిలాయి.

సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు రైతులు ససేమిరా అన్నారు. శనివారం మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన రైతులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతులు ముందుగానే వ్యూహాత్మకంగానే చర్చించుకుని మరీ హాజరయ్యారని తెలుస్తున్నది. దాదాపు వంద మందికి పైగా రైతులు.. పోలీసుల పహారాలో కార్లు, ఆటోల్లో వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.
సీఎం కేసీఆర్‌తో ఏం మాట్లాడాలి?.. పరిహారం ఎంత అడగాలి? చివరకు దేనికి అంగీకరించాలి? దేనికి సమ్మతించకూడదు? ఇలా పలు అంశాలపై చర్చించుకుని.. వినతిపత్రం సిద్ధం చేసుకుని వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ వచ్చి చర్చల్లో పాల్గొన్నారని రైతులు వివరించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చర్చల్లో పాల్గొన్నారు.

మల్లన్న సాగర్ కట్టి తీరుతామన్న సీఎం

మల్లన్న సాగర్ కట్టి తీరుతామన్న సీఎం

'ఊర్లన్నీ పచ్చగ చేసుకుందాం. మన బతుకులు కూడా మంచిగ మారుతయి. మల్లన్నసాగర్‌కు భూములివ్వండి. మీకు పైసలొచ్చేందుకు గొర్లు, బర్లు, కోళ్లు ఇస్త. పరిహారం చెప్పినంతే ఉంటది. లక్ష అటు ఇటు అయితది. అంతకు మించి పెంచేది లేదు. ఏం చేసైనా సరే మల్లన్నసాగర్‌ కట్టి తీరుతా' అని వేములఘాట్‌ గ్రామ నిర్వాసితులకు సీఎం కేసీఆర్ వివరించారు.

Recommended Video

Telangana Minister TS Yadav joins ‘Haritha Haram’ programme at Gandhi Hospital
సీఎం ప్రతిపాదనలకు వినయంగానే రైతుల జవాబిలా

సీఎం ప్రతిపాదనలకు వినయంగానే రైతుల జవాబిలా

సీఎం కేసీఆర్ ప్రతిపాదనలపై రైతులు వినయంగానే 'బర్లు, గొర్లు మాకొద్దు.. కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులు, పరిహారం, పునరావాసం కల్పించాలి. అప్పుడే భూములిస్తం. భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, పశువులకు పశువులు, బడికి బడి, గుడికి గుడి, ఊరికి ఊరు నిర్మించి ఇవ్వాలె. అట్లిస్తనే మా ఊర్ల మల్లన్నసాగర్‌పై తీర్మానం జరుగుతుంది. లేదంటే మా ఉద్యమం ఇట్లే కొనసాగుతుంది. ప్రాణాలైనా ఇస్తాం. న్యాయం జరిగే వరకూ భూముల్ని ఇవ్వం' అని నిర్వాసితులు తేల్చిచెప్పారు.

రైతులకు నచ్చని సీఎం కేసీఆర్ షరతులు

రైతులకు నచ్చని సీఎం కేసీఆర్ షరతులు

వేములఘాట్‌ గ్రామ నిర్వాసితులు 413రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆలస్యంగా సీఎం కేసీఆర్ నిర్వాసితులను ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి పిలిపించి, చర్చించినా పరిహారంపై సీఎం పెట్టిన షరతులు, సర్కార్‌ వైఖరి రైతులకు నచ్చలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. సమావేశం నుంచి బయటకొచ్చిన నిర్వాసితులు చర్చలు జరిగిన తీరును మీడియాకు తెలిపారు. సీఎం వైఖరి సరిగా లేదని, సర్కార్‌పై ప్రతిఘాట్‌గా వేములఘాట్‌ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు.

మూడు గంటల పాటు చర్చలు

మూడు గంటల పాటు చర్చలు

రైతుల కోసం కబురు చేసిన సీఎం కేసీఆర్.. తన వ్యవసాయ క్షేత్రంలో వారి కోసం భోజనాలు సిద్ధం చేశారు. శనివారం ఉదయం 11గంటలకు వేములఘాట్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు, నిర్వాసితులు ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ముందుగా భోజనాలు చేయాలని, అప్పటివరకు సీఎం కేసీఆర్‌ ఇక్కడకు చేరుకుంటారని అక్కడున్న ఫాంహౌస్‌ సిబ్బంది రైతులకు సూచించారు. 'భోజనం చేసేందుకు మేం ఇక్కడకు రాలేదు. చర్చలు జయప్రదమైతే అప్పుడు తింటాం' అని రైతులు నిరాకరించారు. సీఎం వచ్చే వరకు అక్కడే వేచి చూశారు. కొద్ది సేపటికి సీఎం వచ్చి రైతులను పలకరించారు.

సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇలా హామీలు

సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇలా హామీలు

'మల్లన్నసాగర్‌కు ఇంకా 1200 ఎకరాల భూమి సేకరించాలి. అందులో వేములఘాట్‌ నుంచే ఎక్కువ భూమి ఉంది. గ్రామ రైతులు సహకరించాలి. రేటు విషయం గతంలో ఇచ్చినట్టే ఇస్తాం. ఏదైనా ఉంటే కలెక్టర్‌ మీవద్దకే వచ్చి భూములను పరిశీలించి లక్ష రూపాయలు అటోఇటో నిర్ణయిస్తారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి ఇంటికీ గేదెలు, గొర్రెలు, కోళ్లు అందజేస్తాం. ఏది ఏమైనా మల్లన్నసాగర్‌ను కట్టి తీరుతాం' అని సీఎం అన్నారు.

సారవంతమైన భూమి.. మూడు పంటల భూమికి పరిహారం పెంచాల్సిందే

సారవంతమైన భూమి.. మూడు పంటల భూమికి పరిహారం పెంచాల్సిందే

సకల వసతులు కల్పిస్తేనే భూ స్వాధీనమన్న రైతులు

దీనికి రైతులు మాట్లాడుతూ 'వేములఘాట్‌లో సారవంతమైన భూమి ఉంది. ఏటా మూడు పంటలు పండుతాయి. పరిహారం ఆరు లక్షల రూపాయలు ఇస్తామంటే ఎట్లా సారూ! తరతరాలుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్నం. ఉన్న ఊరు ప్రాజెక్టులో కలుస్తుదంటేనే బాధైతాంది. అయినా ఆలోచించాం. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించి అన్ని వసతులు కల్పించాలి. లేదంటే భూములిచ్చేందుకు ఒప్పుకోం' తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఫాంహౌస్‌ నుంచి అన్నం తినకుండానే బయటకు వచ్చేశారు.

రైతులపై కాల్పులు జరిపి ఏడాది

రైతులపై కాల్పులు జరిపి ఏడాది

చర్చలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగాయి. మీడియాను లోనికి అనుమతించలేదు. చర్చలకు ఆలస్యంగా వచ్చిన రైతులను కూడా వ్యవసాయ క్షేత్రం బయటే ఉంచారు. దీంతో నిర్వాసితులు అసహనం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్‌ వద్దని శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న నిర్వాసితులపై గతేడాది పోలీసులు లాఠీలు ఝుళిపించి, తూటాలు పేల్చిన ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడాది అవుతున్నది.

ఎమ్మెల్యేను జోక్యం చేసుకోవద్దని హెచ్చరిక

ఎమ్మెల్యేను జోక్యం చేసుకోవద్దని హెచ్చరిక

‘చర్చలు ఫలవంతం అవుతామని భావించాం. పరిహారం విషయంలో ఎటూ తేలక నిరాశతో వెళుతున్నాం' అని రైతులు పేర్కొన్నారు. చర్చల్లో ఓ సందర్భంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి జోక్యం చేసుకోబోగా గ్రామస్తులు అడ్డుతగిలి.. ఇప్పటి వరకు గ్రామాలోకి రాకుండా ప్రస్తుతం మాట్లాడటం సరికాదని వారించినట్లు కొందరు రైతులు తెలిపారు. ఆర్డీవో తీరుపైనా కొందరు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రైతులు వివరించారు. గ్రామంలో దానం ఇచ్చిన పాఠశాల స్థలానికి చెక్కుల జారీ చేశారని, భూమి రికార్డులు కూడా సరిగ్గా లేవని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని.. ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రైతులు వివరించారు. రెండు పంటలు పండే భూముల విషయంలో విషయంలో కలెక్టర్‌ నేతృత్వంలో పరిశీలించి కొంత పరిహారం పెంచే ఆలోచన చేస్తామని సీఎం చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామంలో అందరం కలిసి మాట్లాడుకుని తుది నిర్ణయం తీసుకుంటామని రైతులు వివరించారు.

ఇదీ మల్లన్న సాగర్ సామర్థ్యం

ఇదీ మల్లన్న సాగర్ సామర్థ్యం

సిద్దిపేట జిల్లాకు సాగునీరందించే వరప్రదాయనిగా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దాదాపు ఏడాదిన్నర క్రితమే భూసేకరణ చేపట్టిన విషయం తెల్సిందే. తొగుటతోపాటు మండల పరిధిలోని ఏటిగడ్డకిష్టాపూర్‌, తుక్కాపూర్‌, పల్లెపహాడ్‌, వేములఘాట్‌, కొండపాక మండలం తిప్పారం, సింగారం, మంగోలు, ఎర్రవల్లి, కోనాయిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 16,448 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఇందులో కొన్ని గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఇప్పటివరకు పలు గ్రామాల రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వగా.. ముఖ్యంగా వేములఘాట్‌ రైతులు ససేమిరా అంటూ కోర్టులకు వెళ్లి.. ఏడాదిగా ఆందోళనలు చేస్తూ గ్రామంలో దీక్షా శిబిరం కొనసాగిస్తున్న సంగతి తెల్సిందే.

English summary
CM K Chandra Sekhar Rao consultations failed with Vemulaghat village farmers. CM assured to gave facilities with farmers but they aren't heeding. Farmers were restricted to implement 2013 Land aquiction act and they cleared that CM KCR Conditions were not implement any cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X