వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో నేను ఫెయిలయ్యానన్న కేసీఆర్, గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు థ్యాంక్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం థ్యాంక్స్ చెప్పారు. తాను ఫెయిలయ్యానని, తనకు ఈ విషయం గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

<strong>వంటేరు చాలా ఓపెన్ గురూ.. టీఆర్ఎస్‌లో ఎందుకు చేరుతున్నాడో దాచుకోకుండా చెప్పేశారు</strong>వంటేరు చాలా ఓపెన్ గురూ.. టీఆర్ఎస్‌లో ఎందుకు చేరుతున్నాడో దాచుకోకుండా చెప్పేశారు

గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం సందర్భంగా రాజాసింగ్ అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన పలు సమస్యలను సృషించారు. లా అండ్ ఆర్డర్, బెట్టింగ్, డబుల్ బెడ్రూం, నేరాలు తదితర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా దూల్‌పేట అంశాన్ని ప్రస్తావించారు.

 దూల్‌పేటపై ప్రశ్నించిన రాజాసింగ్

దూల్‌పేటపై ప్రశ్నించిన రాజాసింగ్

దూల్‌పేట పునరావాస సౌకర్యాల గురించి రాజాసింగ్ అడిగారు. స్పీకర్ ద్వారా తాను ముఖ్యమంత్రికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు (కేసీఆర్) ఇదే అసెంబ్లీ సాక్షిగా గతంలో మాట్లాడుతూ తాను దూల్‌పేటకు వస్తానని, ప్రజలను ఆదుకుంటానని చెప్పారని, కానీ ఈ రోజుకు కూడా దూల్‌పేట ప్రజలు మీ వైపు చూస్తున్నారని, ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మమ్మల్ని ఆదుకుంటారని చూస్తున్నారని అన్నారు.

వారికి ఉపాధి ఏది?

వారికి ఉపాధి ఏది?

మీరు రూ.2 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చి పునరావాస సౌకర్యాలు పూర్తయ్యాయని చెబితే పూర్తి కాదని రాజాసింగ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు గుడుంబా తయారు చేసి బతికారని, కానీ హఠాత్తుగా బంద్ చేశారని, అలా చేసిన తర్వాత వారికి సరైన ఉపాధి లేదని చెప్పారు. మనం వారికి సరైన పునరావాస సౌకర్యాలు కల్పించలేదన్నారు.

 సీఎం మాకే సమయం ఇవ్వరని అంటున్నారు

సీఎం మాకే సమయం ఇవ్వరని అంటున్నారు

ఈ విషయమై తాము ఎన్నోసార్లు ఎక్సైజ్ శాఖ మంత్రికి చెప్పామని, దానికి సదరు మంత్రి మాట్లాడుతూ.. మా ముఖ్యమంత్రి మాకే సమయం ఇవ్వడం లేదు, మీకు ఎప్పుడు ఇస్తారనే చర్చ జరిగిందని రాజ్‌సింగ్ అన్నారు. ఈ రోజు నేను దూల్‌పేటలో ఉంటున్నానని, నేను దూల్‌పేట ప్రజలకు అండగా ఉంటానని, వాళ్ల బాధలు నేను చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను స్కూల్స్‌కు పంపించాలన్నా కూడా వారి వద్ద డబ్బులు లేవన్నారు. అలాంటి వారిని ఎవరు ఆదుకోవాలన్నారు. సీఎంకు బాధ్యత లేదా అన్నారు.

రాజాసింగ్‌కు కేసీఆర్ థ్యాంక్స్

రాజాసింగ్‌కు కేసీఆర్ థ్యాంక్స్

తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని, దూల్‌పేట గుడుంబా బంద్ చేశారని, కానీ వారి పునరావాసం గురించి ఎందుకు ఆలోచించలేదని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. దూల్‌పేట అంశంపై రాజాసింగ్ మాట్లాడుతుండగా... కేసీఆర్ దానిని నోట్ చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యానని, ఈ అంశాన్ని గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు థ్యాంక్స్ అన్నారు.

 దూల్‌పేట అభివృద్ధిపై రాజాసింగ్ దృష్టి

దూల్‌పేట అభివృద్ధిపై రాజాసింగ్ దృష్టి

దూల్‌పేట ప్రజలు ఏళ్లుగా గుడుంబా తయారు చేసి బతుకు వెళ్లదీసేవారు. వారి బతుకులు మార్చుతామని ఎంతోమంది నేతలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. తాము అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకుంటామని 2014 ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు రాజాసింగ్ దానిపై ప్రశ్నించడంతో కేసీఆర్ పెయిలయినట్లు అంగీకరించారు. వారికి పునరావాసం కల్పిస్తానని చెప్పారు. దూల్‌పేట అభివృద్ధిపై రాజాసింగ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

English summary
Bharatiya Janata Party MLA Rajasingh Lodh questioned Telangana Chief Minister K Chandrasekhar Rao over Dhoolpet rehabilitation issue. CM praised and Thanked Rajasingh for raising this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X