వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించిన కేసీఆర్..

రూ. 62,908లతో 20.28 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి స్వామికి బంగారు మీసాలు చేయించారు.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల పర్యటన కొనసాగుతోంది. బుధవారం నాడు వెంకన్న దర్శనం చేసుకున్న ఆయన.. నేడు కురవి వీరభద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారికి రూ.5 కోట్ల మొక్కు: లేఖ రాసి, లెక్క తీస్తానని కేసీఆర్‌కు మర్రి షాక్శ్రీవారికి రూ.5 కోట్ల మొక్కు: లేఖ రాసి, లెక్క తీస్తానని కేసీఆర్‌కు మర్రి షాక్

ఈ సందర్బంగా వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలను సీఎం సమర్పించారు. రూ. 62,908లతో 20.28 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి స్వామికి బంగారు మీసాలు చేయించారు. కానుకలు సమర్పించుకున్న తర్వాత ఆలయంలో పూజలు నిర్వహించారు.

cm kcr thanks giving gift to veerabhadra swamy

పూజా కార్యక్రమాల అనంతరం సీఎంకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ
సందర్బంగా సీఎం కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ లు వీరభద్రస్వామి ఆలయానికి వచ్చారు.

కాగా, బుధవారం నాడు వెంకన్నను దర్శించుకున్న కేసీఆర్.. రూ.5కోట్లతో మొక్కు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. 14.2 కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65 కిలోల బంగారు కంఠెను ఆయన స్వామి వారికి సమర్పించారు.

అయితే సీఎం తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దేవుళ్లకు ఖర్చుపెట్టడమేంటని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాస్వామిక వాదులు ఆయన్ను నిలదీస్తున్నారు.

English summary
Telangana CM KCR gifted gold moustache to Veerabhadraswamy on Friday. Its his third day in tirupati visit,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X