• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం కేసీఆర్ ఈ సారి కూడా సెక్రటేరియట్ ముఖం చూడరా ? పాలన ప్రగతి భవన్ నుండా.. ఫామ్ హౌజ్ నుండా?

|

టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈసారి కూడా సెక్రటేరియట్ లో కాలు పెట్టరా ? ప్రగతి భవన్ నుండి గానీ ఫామ్ హౌజ్ నుండి గానీ పాలన సాగిస్తారా ? ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వాస్తును నమ్మి సెక్రటేరియట్ కు వెళ్ళకుండా పాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆర్ నేనా ? అంటే ఠక్కున అవును అనే చెప్తారు తెలంగాణా ప్రజలు .

సీఎంగా కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్ళింది కేవలం 25 సార్లు

సీఎంగా కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్ళింది కేవలం 25 సార్లు

సీఎం కేసీఆర్ .. ఎవరు ఏమనుకున్నా ఆయన తనకు నచ్చిందే చేస్తారు. ఇక జాతకాలపై, వాస్తు, ముహూర్తాల వంటి వాటిపై కేసీఆర్ కు చాలా గట్టి నమ్మకం వుంది. అందుకే అన్నీ ముహూర్తాల ప్రకారమే, వాస్తు ప్రకారమే జరగాలంటారు. 2014ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఆయన కేవలం 25 సార్లు మాత్రమే సెక్రటేరియట్ కు వెళ్ళారు. ఇది దేశ వ్యాప్తంగా అతితక్కువ రోజులు సెక్రటేరియట్ కు వెళ్ళిన సీఎంగా కేసీఆర్ సాధించిన రికార్డు . ఇక అసలు విషయానికొస్తే సెక్రటేరియట్ కు వాస్తు దోషముందన్న కారణంగా కేసీఆర్ ఇప్పటిదాకా పాత సెక్రటేరియట్ ముఖం చూడలేదు . ఇక మొన్నటి తెలంగాణ ముందస్తు ఎన్నికల వ్యూహం కూడా వాస్తును చూసుకునే నిర్ణయించుకున్న ఆయన అనూహ్యంగా విజయం సాధించారు .మరోమారు సీఎం అయ్యారు. అయినా ఈ సారి కూడా ఆయన సెక్రటేరియట్ ముఖం చూసే దాఖలాలు లేవని పార్టీ వర్గాల భావన.

ఈసారి కూడా సెక్రటేరియట్ కు వెళ్ళే ఛాన్స్ లేదు

ఈసారి కూడా సెక్రటేరియట్ కు వెళ్ళే ఛాన్స్ లేదు

ఈసారి కూడా ఆయన సెక్రటేరియట్లో అసలు కాలు పెట్టని సీఎంగా కేసీఆర్ ఒక రికార్డు సృష్టిస్తారు అనే చెప్పొచ్చు . గత ప్రభుత్వంలో సెక్రటేరియట్ కు వెళ్ళని విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఫామ్ హౌజ్ లో పడుకుని పాలన చేస్తారా ? సెక్రటేరియట్ ముఖమైనా చూడరా ? అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయినాసరే కేసీఆర్ లైట్ తీసుకున్నారు. కనీసం ఈసారైనా సెక్రటేరియట్ కు వెళ్తారా అంటే కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అయ్యే దాకా ఆయన పాత సెక్రటేరియట్ ముఖం చూసేదే లేదు. దీంతో అధికారులకు ప్రగతి భవన్ కు గానీ , ఫామ్ హౌజ్ కు గానీ పరుగులు తీయక తప్పని పరిస్థితి.

ఈసారి తప్పని సెక్రటేరియట్ అధికారుల పరుగులు

ఈసారి తప్పని సెక్రటేరియట్ అధికారుల పరుగులు

సీఎం కేసీఆర్ ను మార్చడం ఏ ఒక్కరి తరం కాదు .అంతా ఆయన బాటలోనే నడవాలి. అందుకే సెక్రటేరియట్ లో సంతకాలు కావాల్సిన ఫైళ్లన్నీ ఇప్పుడు ప్రగతి భవన్ కు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా కేబినెట్ భేటీలకు కూడా కేసీఆర్ ప్రగతి భవన్ నే ఎంచుకున్నారు. కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంతోనూ కేసీఆర్ ప్రగతి భవన్లోనే భేటీ అయ్యారు. ఇక పాలనాపరమైన ఏ నిర్ణయం అయినా ప్రగతి భవన్ లోనో , ఫామ్ హౌజ్ లోనో సీఎం కేసీఆర్ తీసుకోనున్నారు.సెక్రటేరియట్ అధికారులు ఆయనను కలవాలంటే ఈసారి కూడా ఈ తిప్పలు తప్పవా అని లోలోపల మదనపడుతున్నారు.

కొత్త సెక్రటేరియట్ పూర్తయ్యే దాకా పాలన అక్కడ నుండే

కొత్త సెక్రటేరియట్ పూర్తయ్యే దాకా పాలన అక్కడ నుండే

మొత్తంగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయ్యే దాకా ప్రగతి భవన్ కేసీఆర్ కు కార్యక్షేత్రం కానుంది . అది కాకుంటే ఫామ్ హౌజ్ కేంద్రంగా పాలన సాగనుంది. వాస్తు మీద మూఢ విశ్వాసంతో ఇంత వింత నిర్ణయాలు తీసుకుని , ఎవర్నీ లెక్క చెయ్యకుండా పాలన సాగించే విలక్షణ నైజం ఒక్క కేసీఆర్ కే వుంది అని చెప్పటం నిర్వివాదాశం .

English summary
Telangana CM KCR.. who came to power in the 2014 elections and also in recent elections went to the Secretariat only 25 times. KCR has not seen the face of the old secretariat yet due to the "vasthu dosha" issues. Yet this time he is not likely to go to the Secretariat.Due to this reason Any administrative decision will be made at Pragati Bhavan or in the Farm House The Secretariat officials have to run to Pragati Bhavan to meet CM for the official works .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more