వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరానికి సీఎం కేసీఆర్..! ప్రాజెక్టు పట్ల హర్షం వ్యక్తం చేసిన గులాబీ బాస్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు 140 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం ఇతర ప్రాంతాలను ఆయన హెలికాప్టర్‌లో నుండి పరిశీలించారు. సీఎం చంద్రశేఖర్ రావు ఒక హెలికాప్టర్‌లో బయల్దేరుతుండగా... ఆయన వెంట మంత్రి ఈటల రాజేందర్‌, ఉన్నతాధికారులు సొమేశ్‌కుమార్‌, నర్సింగరావు, స్మితా సబర్వాల్‌, రామకృష్ణారావులు ఉంటారు.

కేసీఆర్ సొంతూరు చింతమడకలో అల్లుడు హరీష్.. ఏం చేస్తున్నారంటే..!కేసీఆర్ సొంతూరు చింతమడకలో అల్లుడు హరీష్.. ఏం చేస్తున్నారంటే..!

మరో హెలికాప్టర్‌లో అధికారులు, ఇంజినీర్లు పయనమవుతారు. కేసీఆర్‌ ఈ రోజు ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో పయనమయ్యారు. ఉదయం మేడిగడ్డ బ్యారేజీ చేరుకుని అక్కడ పనులను తిలకిస్తారు. తర్వాత గోలివాడ పంపుహౌస్‌కు చేరుకుని ఎల్లంపల్లి బ్యారేజీని పరిశీలిస్తారు.. అక్కడే మధ్యాహ్నం భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గోలివాడ నుంచి పయనం. 2.15కి ధర్మపురి చేరుకుంటారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోపూజలు చేస్తారు. ఇక అక్కడి నుండి 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

cm kcr to Kaleshwaram trip.!Happy on the Project..!!

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి పరవశించి పోయినట్టు సమాచారం. ఇందులో భాగంగా మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు నూట నలభై కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం ఇతర ప్రాంతాలను ఆయన హెలికాప్టర్‌లో నుండి పరిశీలించానున్నరు. ఇందులో భాగంగానే ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి మురిసిపోయారు.

హెలికాప్టర్‌లో ఉన్న మిగతా వారితో సక్సెస్ అన్నట్లు సంకేతం చూపుతూ సంబురపడ్డారు. ప్రాజెక్టు నిర్మించినందుకు లక్షలాది ఎకరాలకు, రైతులకు ఉపయోగపడిందని సంతృప్తిపడ్డట్లు ఆయన ముఖంలో సంతోషం కనిపించింది. కాగా ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మపురికి వస్తారు. ధర్మపురిలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. సీఎం చంద్రశేఖర్ రావు రాక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మపురి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Telangana CM Chandrasekhar Rao will visit Kaleshwaram Project on Tuesday. From Medadadda to Dharmapuri, 140 km from the Godavari basin, the other areas of the river, such as the Medigadda, Sundala, Annaram and Kaleshwaram, were examined from his helicopter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X