హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో రైలు: 7న ప్రారంభించనున్న కేసీఆర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Day Light Report : 3 Minutes 10 Headlines | Shaheen Bagh Issue | Delhi polls | Nirbhaya case

హైదరాబాద్: నగరవాసులకు మరో కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు.

ఈ మార్గం 9 స్టేషన్లను కలుపుతూ వెళుతుంది. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గత 45 రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించారు. మెట్రో రైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు కూడా పొందింది.

నాగోల్-హైటెక్ సిటీ కారిడార్ 29 కిలోమీటర్లు, మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్ 29 కిలోమీటర్లు ప్రస్తుతం మెట్రో రైలు నడుస్తుండగా.. మూడో కారిడార్ జేబీఎస్-ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి రానుంది.

కాగా, రెండు అతిపెద్ద బస్టాండ్‌లను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ హైదరాబాద్ వాసులకే కాకుండా.. జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఈ మార్గంలో మెట్రో కోసం నగర ప్రజలు ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

 CM KCR to launch JBS-MGBS Metro services on Feb 7th

తొలుత సంక్రాంతి నాటికి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ మార్గం ప్రారంభోత్సవం ఆలస్యమైంది. ఇప్పటికే నడస్తున్న మార్గాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగానే ఉంది. ట్రాఫిక్ చిక్కుకుని సమయం వృథా చేసుకోవడం కంటే మెట్రోను ఆశ్రయించడమే మేలని నగరజీవులు భావిస్తుండటంతో మెట్రో రద్దీ భారీగానే ఉంటోంది.

English summary
The much awaited services of the Hyderabad Metro Rail between Jubilee Bus Station (JBS) and Mahatma Gandhi Bus Station (MGBS) will be inaugurated by Chief Minister K Chandrashekhar Rao at 4 pm on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X